దేవుని దగ్గర కోరుకొనే కోరికను బయటకు చెప్పకూడదు....ఎందుకో తెలుసా?

సాధారణంగా ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్లిన, ఇంటిలో పూజ చేసుకున్న ఎదో ఒక కోరిక కోరుకోవటం సాధారణమే.

ఆ కోరిక పెద్దది అయినా చిన్నది అయినా సరే బయటకు చెప్పకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు.

ఆలా బయటకు ఎందుకు చెప్పకూడదో అనే దానికి కూడా ఒక కారణం ఉంది.

ఆ కారణం గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం.దేవుణ్ణి మనం కోరిక కోరుకున్నాం అంటే అది మనకు సాధ్యం కానిదే అయ్యింటుంది.

అలాంటి కోరికను భగవంతుడు తీరిస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు.ఒకవేళ మనం కోరుకున్న కోరికను బయటకు చెప్పితే విన్నవారు బయటకు ఆనందంగా ఉన్నా లోపల మాత్రం ఆ కోరిక నెరవేరకూడదని అనుకుంటారు.

ఆ కోరిక మనకు తీరకుండా ఉండటానికి మానవ ప్రయత్నం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి.

అందుకే మన పెద్దవారు ఏ ఆచారం పెట్టిన బాగా అలోచించి మాత్రమే పెడతారు.

మన పెద్దవారు పెట్టే ఆచారాలు అన్నిటిలోను పరమార్ధం ఉంటుంది. """/"/ ఆయితే గుడికి వెళ్ళినప్పుడు తీర్ధం నిల్చుని మాత్రమే తీసుకోవాలి.

అదే ఇంటిలో అయితే కూర్చుని తీసుకోవచ్చు.చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని దండం పెడుతూ ఉంటారు.

ఆలా చేయటం తప్పు.గుడికి వెళ్లిన వెంటనే స్వామిని తనివితీరా చూసి ఆ తర్వాత మాత్రమే కళ్ళు మూసుకొని మన మనస్సులోని కోరికలను దేవునికి నివేదించాలి.

గేమ్ ఛేంజర్ లీక్ వెనుక ఉన్నది వాళ్లేనా.. అడిగిన డబ్బు ఇవ్వలేదనే అలా చేశారా?