పవర్లూమ్ కార్మికుల డిమాండ్లను అన్ని పార్టీల వారు మేనిఫెస్టోలో పెట్టాలి
TeluguStop.com
పవర్లూమ్ కార్మికుల( Power Loom ) డిమాండ్లను అన్ని పార్టీల వారు మేనిఫెస్టోలో పెట్టాలని తెలంగాణ పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణం(Sirisilla ) నెహ్రు నగర్ లోని భవాని ఫంక్షన్ హాల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్ కార్మికుల విస్తృతస్థాయి సమావేశాన్ని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ హాజరై మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పవర్లూమ్ కార్మికుల డిమాండ్లను అన్ని పార్టీలు మేనిఫెస్టో లో పెట్టీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పవర్లూమ్ కార్మికులకు నిరంతరం సంవత్సరం పాటు ఉపాధి కల్పించాలని , వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందుబాటులోకి తీసుకురావాలని , బతుకమ్మ చీరల 10% యారన్ సబ్సిడీని కాలయాపన చేయకుండా ఏ సంవత్సరం ఆ సంవత్సరమే అందించాలని , టెక్స్టైల్ పార్కులో మూతపడ్డ పరిశ్రమలను తెరిపించాలని, పూర్తిస్థాయిలో పరిశ్రమలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొని కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు.
వలస కార్మికులకు కాకుండా స్థానిక కార్మికులకే మొదట ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పై డిమాండ్లను తీర్మానాలుగా ప్రవేశపెట్టి కార్మికులందరి అభిప్రాయంతో ఆమోదింప చేసుకోవడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ( Telangana Power Loom Workers Union )అధ్యక్షులు మూషం రమేష్ , మోర అజయ్ , ఎలిగేటి రాజశేఖర్ , కూచన శంకర్ , నక్క దేవదాస్ , గోవిందు లక్ష్మణ్ , సబ్బని చంద్రకాంత్ , మోర తిరుపతి , సందుపట్ల పోచమల్లు , శ్రీనివాస్ , సదానందం రమేష్ , వేణు పెద్ద ఎత్తున పవర్లూమ్ కార్మికులు పాల్గొన్నారు.
యువకులను మాత్రమే డేటింగ్ చేసే వృద్ధురాలు.. కారణం తెలిస్తే షాకే..