ఏదో చేయమంటే ఇంకేదో చేసిన డెలివరీ బోయ్.. షాక్‌ అయిన మహిళ

ఆన్‌లైన్ ఆర్డరింగ్ మన జీవితాలను చాలా సులభతరం చేసిందనడంలో సందేహం లేదు.రుచికరమైన ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి మనకు ఇష్టమైన రెస్టారెంట్‌కు డయల్ చేయాల్సిన రోజులు పోయాయి.

స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లు మనకు ఇష్టమైన ఆహారాన్ని కేవలం కొన్ని క్లిక్‌లలో అందుబాటులో ఉంచాయి.

అయినప్పటికీ, ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేసేటప్పుడు తరచుగా కొన్ని అనుకోని ఘటనలు జరుగుతుంటాయి.

తాజాగా ఇదే కోవలో ఓ మహిళ కేక్ ఆర్డర్ చేసింది.అందులో డెలివరీ బోయ్‌కు కొన్ని సూచనలు చేసింది.

ఆమె ఒకటి చెప్తే దానిని డెలివరీ బోయ్ మరోలా అర్ధం చేసుకున్నాడు.ఈ ఘటన నవ్వులు పూయిస్తోంది.

దీనికి సంబంధించిన ఫేస్ బుక్ పోస్ట్ వివరాలిలా ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళ వైష్ణవి ఇటీవల ఓ కేక్ ఆర్డర్ పెట్టింది.

దానిని తీసుకొచ్చే డెలివరీ బోయ్‌కు ప్రత్యేకమైన సూచనలు చేసింది.అందుకోసం డిస్క్రిప్షన్‌లో ఓ సందేశం రాసింది.

రూ.500ల చేంజ్ తీసుకు రావాలని ఆమె అందులో పేర్కొంది.

అయితే పొరబడిన డెలివరీ బోయ్.ఆ మెసేజ్‌ను కేక్‌పై రాయించాడు.

దీంతో వైష్ణవి డెలివరీ చేసే వ్యక్తిని రూ.500లను ఛేంజ్ తీసుకు రావాలని, చిల్లర సమస్య రాకుండా ఉండాలని ఆమె భావన.

రూ.500లు చిల్లర తీసుకొస్తే సులభంగా నగదు చెల్లింపును చేయడానికి ఆమె ఆలోచించింది.

కానీ రెస్టారెంట్ లేదా బేకరీ తప్పుగా అర్థం చేసుకుని కేక్‌పైనే సందేశాన్ని రాశారు.

దీనిని ఆమె ఫోటో తీసి, ఫేస్ బుక్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని తెలియజేసింది.

దానికి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు ప ెడుతున్నారు.

యంగ్ ఏజ్ లోనే వైట్ హెయిర్ వచ్చేసిందా.. వర్రీ అవ్వకుండా ఈ రెమెడీని ట్రై చేయండి!