ఒక్క పనితో హీరో అయిపోయిన డెలివరీ బాయ్.. పోలీసులు సైతం ఫిదా!

అవును, ఒక్క పనితో ఓ పిజ్జా డెలివరీ బోయ్ హీరోగా మారిపోయాడు.దాంతో USలోని పెన్సిల్వేనియాలో టైలర్ మోరెల్( Tyler Morrell ) అనే 29 ఏళ్ల పిజ్జా డెలీవరీ బాయ్‌ని జనం ఆకాశానికెత్తేస్తున్నారు.

ఇంతకీ అతను ఏం చేశాడంటే? మిడిల్ టౌన్ టౌన్‌షిప్‌లోని ( Middle Town Township )ఒక కస్టమర్ ఇంటికి మోరెల్ పిజ్జా డెలీవరీ చేయడానికి వెళ్లాడు.

సరిగ్గా అదే సమయంలో అనూహ్యంగా వీధిలో పోలీసు వ్యాన్ సైరన్ వినిపించింది.ఓ కారుని ఛేజ్ చేస్తూ పోలీస్ వ్యాన్ అతనికి కనిపించింది.

కారుని దొంగిలించి వెళ్తున్న ఓ దొంగను ఆ వ్యాన్ వెంబడిస్తోంది.కారుని ఆపి అందులోంచి దూకిన దొంగ మోరెల్ ఉన్న వైపు పరుగులు తీస్తూ వచ్చాడు.

"""/" / దాంతో మోరెల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కాలితో అతడిని తన్ని ఒక్క దెబ్బతో కింద పడేశాడు.

వెంటనే పోలీసులకు ఆ దొంగ చిక్కాడు.అలా దొంగను పట్టుకోవడంతో మోరెల్ వారికి ఎవ్వరూ సాహసం చేయలేని రీతిలో సహాయం చేయడం వలన ఒక్కరాత్రిలో హీరో అయిపోయాడు.

ఈ సీన్ అంతా అతను పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చిన డోర్ బెల్ కెమెరాలో క్యాప్చర్ కాగా సోషల్ మీడియాలో షేరైన ఈ వీడియో చూసి అనేకమంది స్పందించారు.

"""/" / ఇక పోలీసు డిపార్ట్మెంట్ అయితే మోరెల్ సాహసాన్ని తెగ మెచ్చుకున్నారు.

అతను చేసిన సాయానికి ధన్యవాదాలు చెబుతూనే నీలాంటి మంచి వ్యక్తులకు ఉద్యోగం ఇవ్వడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

ఇలాంటి ఉద్యోగిని పెట్టుకున్న కోకోస్ పిజ్జా ఆస్టన్ కంపెనీని అభినందించారు.ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.

కాగా ఆ డెలివరీ బాయ్ కి ఇపుడు పోలీసులే తన చదువుకి తగ్గ ఉద్యగాన్ని ఇచ్చే పనిలో వున్నారని టాక్.