సోము వీర్రాజుకు బ్రేకులు వేసిన ఢిల్లీ పెద్ద‌లు.. ఇక సొంత నిర్ణ‌యాలు ఉండ‌వ‌ట‌..

బీజేపీలో రాణించాలంటే క‌చ్చితంగా ఆ పార్టీకి మూల స్తంభం అయిన‌టువంటి ఆర్ ఎస్ ఎస్ నుంచి రావాల్సిందే.

బండి సంజ‌య్‌, ద‌త్తాత్రేయ లాంటి వారు ఈ నేప‌థ్యం ఉన్న వారు కాబ‌ట్టే పార్టీలో ఇంకా మ‌నుగ‌డ సాగిస్తున్నారు.

ఇక ఏపీలో పార్టీ విష‌యానికి వ‌స్తే సోము వీర్రాజు కూడా ఇలాంటి నేప‌థ్యం నుంచి వ‌చ్చిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.

అంద‌కే ఆయ‌న్ను ఏరికోరి మ‌రీ పార్టీ అధ్య‌క్షుడిగా నియ‌మించారు.పైగా ఏపీలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కూడా.

ఇన్ని అవ‌కాశాలు ఆయ‌న‌కు ఉన్నాయి కాబ‌ట్టే పార్టీ ప‌గ్గాల‌ను ఢిల్లీ పెద్ద‌లు ఇచ్చారు.

అయితే ఇప్పుడు ఎందుకో ఆయ‌న పార్టీలో అంత‌గా జోరు చూపించ‌ట్లేదు.అంత‌కు ముందు ఉన్నంత రేంజ్ లో పార్టీని ప‌రిగెత్తించ‌ట్లేదు సోము వీర్రాజు.

కాపు సామాజిక వ‌ర్గాన్ని ఆయ‌న త‌మ‌వైపు తిప్పుకుంటార‌ని, త‌ద్వారా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం త‌మ పార్టీవైపు ఉంటే క‌చ్చితంగా త‌మ పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌నుకున్నారు.

కానీ వారిని ఆక‌ట్టుకోవ‌డం‌‌లో కూడా సోము వెన‌క‌బ‌డిపోతున్నారు.మొన్న‌టి వ‌ర‌కు పార్టీలో క్రియాశీల‌కంగా ఉన్న వారంతా ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారు.

ఎందుకంటే సోము వీర్రాజు ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు, బ‌య‌టి పార్టీల నుంచి వ‌చ్చిన వారిని న‌మ్మ‌క‌పోవ‌డం లాంటివి ఉన్నాయంట.

"""/" / ఇక ఇదే విష‌యం మీద సోము వీర్రాజుకు ఫిర్యాదు కూడా చేశారంట పార్టీలోని నాయ‌కులు.

కన్నా లక్ష్మీ నారాయణ, దగ్గుబాటి పురంధేశ్వరి లాంటి క్రియాశీల‌క లీడ‌ర్ల సేవ‌లు, స‌ల‌హాల‌ను సోము ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే ఆరోప‌ణ‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఇలా అనేక విష‌యాల‌పై సోము మీద ఢిల్లీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయంట‌.దీంతో కేంద్ర నాయకత్వం బాగానే క్లాస్ ఇచ్చింద‌ని తెలుస్తోంది.

ఈ కార‌ణంగా సోముతో పాటు పార్టీ ప‌గ్గాల‌ను కోర్ కమిటీతో క‌లిసి బిగించారు.

దీంతో కోర్ కమిటీ చెప్పిందే ఇప్పుడు సోము చేయాలి త‌ప్ప సొంత నిర్ణ‌యాలు మాత్రం ఇక‌మీద ఉండ‌బోవ‌ని అమిత్ షా చెప్పేశారంట‌.

ఇలా సోము స్పీడుకు బ్రేకులు ప‌డ్డ‌ట్టు అయిపోయింది.

Purandeswari : ఏపీలో కూటమి గెలుపు చారిత్రక అవసరం..: పురంధేశ్వరి