రాహుల్ గాంధీకి బాసటగా నిలిచిన ఢిల్లీ సీఎం..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాసటగా నిలిచారని తెలుస్తోంది.

మోదీ ఇంటి పేరున్న వారందరూ దొంగలే అంటూ గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

ఈ కామెంట్స్ పై గుజరాత్ సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

దీనిపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్రం బీజేపీయేతర నేతలను టార్గెట్ చేస్తుందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలతో తమకు విభేదాలున్నాయన్నది వాస్తవమేనని తెలిపారు.కానీ రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో ఇరికించడం మాత్రం సరికాదని వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం. మేకను రేప్ చేసిన కామాంధుడు.. వీడియో వైరల్..