జ‌వాన్ల‌తో పాటే కూంబింగ్ నిర్వ‌హిస్తున్న జింక‌.. ఎందుకంటే...?

చేసిన సాహయాన్ని మ‌ర్చిపోతే అంత‌కు మించిన త‌ప్పు మ‌రొక‌టి ఉండ‌దేమో.ఎందుకంటే ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు ఆదుకున్న వారి కంటే ఎవ‌రూ గొప్ప‌వారు కాదు క‌దా.

అందుకే ప్ర‌తి సంద‌ర్భంలో మ‌న‌కు సాహయం చేసిన వారిని గుర్తు పెట్టుకోవాలి.ఇలా చేసిన సాహయానికి తిరిగి సాహయం చేయ‌డం కూడా మ‌ర్చిపోకూడ‌దు.

అయితే ఇలాంటి మ‌న‌స్త‌త్వాలు మ‌నుషుల‌కే కాదండోయ్ జంతువుల‌కు కూడా ఉంటుంది.ఇందుకు మేం చెప్ప‌బోయే స్టోరీనే నిద‌ర్శ‌నం.

ఇందులో ఓ జింక త‌న‌కు సాహయం చేసిన జ‌వాన్లను విడిచి వెళ్ల‌ట్లేదు.సాధార‌ణంగా జంతువులు ఏదైనా ఆప‌ద‌ల్లో చిక్కుకుంటే మ‌నుషులు సాహయం చేయ‌డం చాలా కామ‌న్‌.

ఇలా సాహయం చేసిన మ‌నుషుల వ‌ద్ద ఆ జంతువులు అస్స‌లు ఉండ‌వు.త‌మ స్థావ‌రాల‌కు అన‌గా అడ‌విలోకి వెళ్లిపోతాయి.

కానీ ఇప్పుడు ఓ జింక మాత్రం అలా చేయ‌ట్లేదు.ఛత్తీస్ గడ్, ఒరిస్సా స‌రిహ‌ద్దుల్లో నిత్యం జ‌వాన్లు సంచ‌రిస్తూనే ఉంటారు.

అయితే సుకుమా జిల్లా కుస్తారం అట‌వీ ప్రాంతంలో ఇలాగే జ‌వాన్లు కూంబింగ్ నిర్వ‌హిస్తుండ‌గా వారికి అక్క‌డ ఓ గాయ‌ప‌డిన జింక క‌నిపించింది.

వెంట‌నే దానికి సాహయం చేసి కాపాడారు. """/" / అయితే ఇలా కాపాడిన జ‌వాన్ల‌ను విడిచి పెట్టేందుకు ఆ జింక ఒప్పుకోవ‌ట్లేదు.

త‌న‌కు చికిత్స చేసి కాపాడిన జ‌వాన్ల‌తోనే ఉంటోంది.వారిని విడిచి అస్స‌లు వెళ్ల‌ట్లేదు.

వారితో పాటు అడ‌విలో కూంబింగ్ నిర్వ‌హించేందుకు వెళ్తోంది.దీంతో వారు కూడా ఆ జింక‌ను త‌మ‌తో పాటే ఉంచుకుంటున్నారు.

ఇక దీనికి బ్యూటీ అని పేరుతో పిలుస్తున్నారు జ‌వాన్లు.తాము ఎలాంటి యుద్ధానికి వెళ్తున్నా స‌రే ఆ జింక త‌మ వెంటే వ‌స్తోంద‌ని, అందుకే దాన్ని కూడా త‌మ వెంట డ్యూటీకి తీసుకెళ్తున్నామ‌ని చెబుతున్నారు.

ఇక ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

వీడియో: పురాతన నిధికి కాపలాగా భయంకర జీవులు.. అదే ఆశ్చర్యకరం..