తెలంగాణ ప్రజల కోసమే నిర్ణయం..: వైఎస్ షర్మిల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్ టీపీ దూరంగా ఉండనుంది.ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేయడం లేదని వెల్లడించారు.

తెలంగాణ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని షర్మిల తెలిపారు.తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు చీల్చితే కేసీఆర్ లాభపడతారని పేర్కొన్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చకూడదని చాలా మంది కాంగ్రెస్ పెద్దలు సూచించారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నేతలపై, కార్యకర్తలపై తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు.వైఎస్ఆర్ బిడ్డగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు.

మిస్ ఇండియా యూఎస్ఏగా చెన్నై భామ.. ఎవరీ కైట్లిన్ సాండ్రా?