చనిపోయిన తాచు పాము కోరల్లో విషం ఉంటుంది.. సీరియల్ నటుడు సాయి కిరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కేవలం నటులుగానే కాకుండా వేరే వృత్తులలో కూడా బిజీగా ఉంటారు.

కొందరు బిజినెస్ లలో బిజీగా ఉంటే మరికొందరు ఆశ్చర్యపడే వృత్తులలో చేస్తూ తామేమిటో నిరూపించుకుంటారు.

అందులో సీరియల్ నటుడు సాయి కిరణ్ కూడా ఒకరు.ఈయన నటుడుగానే కాకుండా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు చేపట్టాడు.

ఇదిలా ఉంటే తాజాగా చనిపోయిన తాచు పాము కోరల్లో కూడా విషం ఉంటుందని కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

సాయి కిరణ్ తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు.నువ్వేకావాలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత పలు సినిమాలలో నటించాడు.

ఇక ప్రేమించు సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కానీ వెండితెరపై ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు.

బుల్లితెరపై మాత్రం మంచి పేరు సంపాదించుకున్నాడు.బుల్లితెరపై ఇప్పటికి చాలా సీరియల్స్ లలో నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

కొన్ని దైవానికి సంబంధించిన పాత్రల్లో కూడా అద్భుతంగా నటించాడు.ఇక కోకిలమ్మ సీరియల్ లో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.

వీటితోపాటు అభిలాష, సుందరకాండ, భారతి సీరియల్ లో కూడా నటించాడు. """/"/ ప్రస్తుతం సాయి కిరణ్ గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈయన ఒక నటుడుగానే కాకుండా హైదరాబాద్ బ్లూ క్రాస్ సంస్థ లో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా చేపట్టాడు.

ఇతర సంస్థలలో కూడా పలు బాధ్యతలు చేపట్టాడు.ఇక సాయికిరణ్ కు పాములు పట్టే అలవాటు ఉంది.

ఈ విషయాన్ని తాను గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలిపాడు.తనకు చిన్నప్పటి నుంచి పాములు పట్టుకోవడం హాబీ అని ఇప్పటికి మూడు వేల పాములు పట్టుకున్నాను అని తెలిపాడు.

వాటిని పట్టుకొని నేరుగా అడవులలో వదిలి పెట్టేవాడట.దాంతో ఈయనకు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అందాయి.

"""/"/ తను రెండో తరగతి చదువుతున్నప్పుడు తన సైన్స్ టీచర్ వర్షం లో వచ్చిన వాన పాములను పట్టుకునిచెట్ల దగ్గర వేస్తే చెట్లు బాగా పెరుగుతాయని చెప్పడంతో అప్పటినుంచి పాములు పట్టడం తనకు అలవాటు అయిందని తెలిపాడు.

అలా ఓ సారి తాను విషసర్పం అయినా తాచుపాము ని కూడా పట్టుకున్నానని తర్వాత అది విష సర్పం అని తెలిసిందని అన్నాడు.

అయినా కూడా వాటిని కూడా పట్టుకొని అడవుల్లో వదిలేసే ఆలోచన రావటంతో అప్పటి నుంచి విషసర్పాలు కూడా పట్టుకుంటానని తెలిపాడు.

అందులో చాలా మెలుకువలు నేర్చుకున్నానని కూడా తెలిపాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని చనిపోయిన తాచు పాము కొరల్లో కూడా విషం ఉంటుందని తెలిపాడు.

"""/"/ ఈ విషం అనేది ప్రోటీన్ అంటూ అది అంత తొందరగా పోదని అన్నాడు.

తాచు పాము చనిపోతే.వెల్లికిలా దాన్ని బాడీ ఉంటే దాని కోరలు పైకి నిట్ట నిలువుగా ఉంటాయని ఉన్నాడు.

చనిపోయేటప్పుడు సంఘర్షణకు లోనై తే కోరలకు విషం ఉండొచ్చని.అలా తాచుపాము చనిపోయిన ఒకటి రెండు నెలల వరకు ఉంటుందని.

ఆ కోరలు గుచ్చుకుంటే ప్రమాదం ఉంటుందని మరెన్నో విషయాలు తెలిపాడు.

రోడ్డుపై వెళ్తుండగా బైక్ నుంచి ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు.. చివరికి..?