వింత వ్యాధితో బాధపడుతూ ఎమోషనల్ నోట్ రాసిన అమీర్ ఖాన్ కూతురు?

స్టార్ హీరో అమీర్ ఖాన్ గారాలపట్టి ఐరా ఖాన్ ఒక వింత వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా ఈ విషయాన్ని ఐరా ఖాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఒక మాయదారి రోగం తనని వెంటాడుతోందని ఈ సందర్భంగా తాను బాధపడుతున్న వింత వ్యాధి గురించి ఈమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఇంతకీ ఆమెను వెంటాడుతున్న ఆ వింత వ్యాధి ఏమిటి అనే విషయానికి వస్తే.

ప్రస్తుతం తనపై యాంగ్జైటీ అని ఒక వింత వ్యాధి దాడి చేస్తోందని,గతంలో తనకు ఈ వ్యాధి లేకపోయినప్పటికీ ప్రస్తుతం తనని పట్టిపీడిస్తోందని వెల్లడించారు.

ఈ వ్యాధి వల్ల ఎంతో ఉద్వేగానికి గురవ్వడమే కాకుండా క్రైయింగ్ ఫిట్స్ పట్టి చంపేస్తోంది అంటూ బాధను వెల్లబుచ్చింది.

ఈ సమస్య తనకు ఎలా వచ్చిందో ఇప్పటికీ తనకు అర్థం కాలేదని గతంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇలాంటి వ్యాధితో బాధపడే తను ప్రతి రోజు ఈ వ్యాధిని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

"""/"/ ఈ వ్యాధితో బాధపడుతూ సరిగా నిద్ర కూడా పట్టడం లేదని, నన్ను ఈ వ్యాధి వదలడం లేదు నా భయం ఏంటో తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది.

నాకే ఇలా ఎందుకు జరుగుతోందో అంటూ ఐరా ఖాన్ తనను వెంటాడుతున్నవింత వ్యాధి గురించి ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బిగ్ రిలీఫ్… హై కోర్ట్ సంచలన తీర్పు!