చిన్న వర్షానికే కూలిన ఉదయ సముద్రం ఎత్తిపోతల కల్వర్టు వాల్…!

నల్లగొండ జిల్లా:శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి సముద్రం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్దండెంపల్లి శివారు వద్ద నిర్మించిన ఎత్తిపోతల రిటెన్షన్/కల్వర్టు వాల్ కొట్టుకుపోయి కాల్వలో పడిందని,అదృష్టవశాత్తు ఆ రోడ్డుపై ప్రయాణించే వారెవరికీ నష్టం జరుగలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కన్మంతరెడ్డి శ్రీదేవి ( Kanmantha Reddy Sridevi )అన్నారు.

శనివారం ఉదయం ఆమె కల్వర్టు వాల్ ను సందర్శించి జరిగిన ఘటనపై అధికారులతో మాట్లాడి కారణాలను తెలుసుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ వాల్ నిర్మాణం నాణ్యతా ప్రమాణాల ప్రకారం జరుగలేదని,మిషన్ భగీరథ పైపులు వేసినప్పుడు సరియైన జాగ్రత్తలు తీసుకోలేదని, పైప్ లైన్ లీకేజ్ అవడం మరియు వినాయక చవితి సందర్భంగా లూజ్ మట్టి నింపి నిమజ్జనం కొరకు ఆ స్థలాన్ని మున్సిపాలిటీ ఉపయోగించడం వల్ల కూడా కల్వర్టు పటిష్టతకు నష్టం జరిగిందన్నారు.

రాబోవు ఎన్నికల దృష్ట్యా ఇటీవల బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ వద్ద హడావుడిగా ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో కూడా దీనిపై దృష్టి సారించకపోవడం కేసిఆర్ప్ర భుత్వ నిర్లక్ష్య వైఖరికి తార్కాణమని,పైపై మెరుగులతో ప్రజల దృష్టిని మరలించడమేనని దుయ్యబట్టారు.

కేసిఆర్ కు ప్రజలను వంచించడం నిత్యకృత్యమని,నల్లగొండ పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధి పేరుతో రోజూ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు తీరని నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో కన్మంతరెడ్డి రమేష్ రెడ్డి( Kanmantha Reddy Ramesh Reddy ),ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు అధ్యక్షుడు కొండ భవాని ప్రసాద్,జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి,ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ నర్సింహ్మ, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ప్రసాద్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

నిమ్మ తొక్కలు పనికిరావని పారేస్తున్నారా.. ఇలా వాడితే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది..!