39 ఏళ్లుగా వారి ఇంట్లోనే ఉంటున్న మొసలి.. ఎందుకంటే..?!

ప్రపంచంలోని చాలా దేశాల్లో చాలా మంది ఇళ్లలో సాధు జంతువులు గా పిల్లిని లేకపోతే కుక్కలను పెంచుకోవడం ఎక్కువగా చూస్తూ ఉంటాము.

కాకపోతే మరి కొందరు జంతు ప్రేమికులు సింహాలు, పులులు, పాములను పెంచుకోవడం కూడా మనం అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ,ఉంటాము.

అయితే జపాన్ దేశానికి చెందిన ఓ కుటుంబం మాత్రం ఏకంగా ఓ మొసలి ని పెంచుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది.

వారు ఏకంగా గత 39 సంవత్సరాల నుంచి ఆ మొసలితో సహవాసం చేస్తున్నారంటే నిజంగా ఆలోచించదగ్గ విషయమే.

అతి క్రూరమైన జంతువుల్లో మొసలి కూడా ఒకటి.అలాంటి మొసలి ఆ కుటుంబంతో కలిసి 39 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తుంది.

కుక్కకు లాగే ఈ మొసలికి కూడా విశ్వాసం బాగానే ఉందంట.అందుకే కాబోలు ఆ మొసలి వారితో ఉన్న కానీ వారిని ఏమీ చేయకుండా వదిలేసింది.

జపాన్ దేశంలోని హిరోషిమాలోని క్యురే నగరానికి చెందిన నాబుమిట్సు మురాబ్యసీ కొడుకు 39 సంవత్సరాల క్రితం మారాం చేయగా ఓ దుకాణంలో ఉన్న ఆ మొసలి పిల్లను వారి ఇంటికి తీసుకువచ్చారు.

అంతే కాదు దానికి కైమ్యాన్‌-సన్ అనే పేరును కూడా నామకరణం చేశారు.అప్పటి నుంచి ఆ మొసలి వారి కుటుంబ సభ్యుల లో ఒకటిగా మారిపోయింది.

ప్రస్తుతం ఆ మొసలి 45 కేజీల బరువు, 6.8 అడుగుల పొడవు కలిగి ఉంది.

అయితే ఆ మొసలి చాలా మంచిది అని నాబుమిట్సు చెబుతున్నాడు.ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి గాయం చేయలేదని చెప్పుకొచ్చాడు.

"""/"/ ఈ మొసలిని ఉద్దేశించి అతడు మాట్లాడుతూ.ఈ మొసలి ఇంత పెద్దది అవుతుందని తాను ఏ రోజు కూడా అనుకోలేదని ఆ మొసలి కి తను బ్రుషింగ్ కూడా చేపిస్తాను అని, అంతేకాకుండా అప్పుడప్పుడు మొసలిని తనతో పాటు వాకింగ్ కూడా తీసుకువెళ్తానని చెప్పుకొచ్చాడు.

వీటితో పాటు తన భార్య తనతో రోజు గొడవ పడుతుందని అందుకేనేమో తాను తన భార్యతో కంటే ఎక్కువ సమయం మొసలితోనే గడుపుతానని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ మొసలిని తన ఇంట్లో పెంచుకోవడానికి ఆ దేశ అధికారుల వద్ద కూడా అనుమతి తీసుకున్నాడు.

ఇలా వారు ఇద్దరు కలిసి బయట వాకింగ్ చేస్తున్న సమయంలో మొదట్లో వారిని చూసి అక్కడి స్థానికులు బాగా భయపడేవారని, అయితే క్రమేపీ అక్కడి వారికి మా బంధం తెలిసిపోవడంతో వారికీ కూడా అలవాటైపోయిందని చెప్పుకొచ్చాడు.

ఇలా వారిద్దరూ బయటికి వచ్చిన సమయంలో ఆ మొసలితో ఆ ప్రాంతంలోని పిల్లలు, ఆ మొసలిని ఏమి చేసినా సరే అది అస్సలు పట్టించుకోదు.

దీంతో ఆ మొసలి జపాన్ దేశంలో ఓ సెలబ్రిటీగా మారిపోయింది.

పుష్ప ది రూల్ మూవీలో శ్రీలీలకు ఛాన్స్.. జానీకి బదులుగా ఆ కొరియోగ్రాఫర్ కు ఛాన్స్ దక్కిందా?