నీటిలో జింకను చేజ్ చేసిన మొసలి.. లాస్ట్ ట్విస్ట్ అసలు ఊహించలేరు..
TeluguStop.com
జింకలు( Deers ) క్రూర మృగాల నుంచి అనునిత్యం తప్పించుకుంటూ బతకాల్సి ఉంటుంది.
పులులు, మొసళ్లు, అడవి కుక్కలు, నక్కలు, హైనాలు, తోడేళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే వాటికి అడవిలో అన్ని క్రూర మృగాల నుంచి ప్రమాదం )పొంచి ఉంటుంది.
అయితే ఇన్ని ప్రమాదాలు ఉన్నా అవి కొన్ని సమయాల్లో అంత ఈజీగా చనిపోవు.
చాలా ప్రయత్నించి చివరికి బయటపడుతుంటాయి.తాజాగా అలాంటి జింకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా( Social Mediaలో చక్కర్లు కొడుతోంది.
దీనిని @TheFigen_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 43 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
"లైఫ్ అంటే ఏంటి? ఎప్పుడూ ప్రయత్నాలను వదులుకోకపోవడమే" అని దీనికి ఒక క్యాప్షన్ కూడా జోడించారు.
"""/" /
వైరల్ అవుతున్న వీడియోలో ఒక చెరువు లాంటి నీటి వనరులో పెద్ద జింక ముందుకు వెళుతూ ఉండటం మనం గమనించవచ్చు.
దాదాపు గొంతు దాకా వచ్చిన నీటిలో అది మునిగిపోకుండా చాలా వేగంగా ముందుకు గెంతుతూ వెళ్ళింది.
దాని వెనకే ఒక పెద్ద మొసలి( Crocodile ) రావడం మనం గమనించవచ్చు.
కొంత దూరం వెళ్ళాక జింక ముందుకు ఈదటం కనిపించింది.అయితే మొసలి దీనికంటే వేగంగా వెళుతూ చివరికి దానిని చేరుకుంది.
"""/" /
జింక మెడను తన నోట కరుచుకోవడానికి ట్రై చేసింది.కానీ జింక మళ్లీ నీటిలోకి పెద్ద ఎత్తుకు ఎగురుతూ చాలా వేగంగా ఒడ్డుకు చేరుకుంది.
దాంతో మొసలి ఓడిపోయింది.జింక ప్రాణాలతో బయటపడగలిగింది.
ఒళ్ళు గగుర్పొడిచే ఈ దృశ్యాలను చెరువు పక్కనే రోడ్డుమీద కారులో వెళుతూ ఒక వ్యక్తి రికార్డ్ చేశాడు.
దాదాపు రెండు, మూడు వందల మీటర్ల పాటు జింకను మొసలి చేజ్ చేసింది.
ఒక నిమిషం పాటు నిడివిగల ఈ వీడియో సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించింది.
ఈ వీడియోని చూసి చాలామంది జింక పట్టుదలను పొగుడుతున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)