రంజాన్ నెలవంక కనిపించలేదు.. రంజాన్ మొదటి ఉపవాసం మార్చి 24వ తేదీ నుంచే..!

రంజాన్ నెలవంక కనిపించలేదు రంజాన్ మొదటి ఉపవాసం మార్చి 24వ తేదీ నుంచే!

ఇస్లామిక్ క్యాలెండర్( Islamic Calendar ) లో అత్యంత పవిత్రమైన నెలగా రంజాన్ పండుగ( Ramadan )ను భావిస్తారు.

రంజాన్ నెలవంక కనిపించలేదు రంజాన్ మొదటి ఉపవాసం మార్చి 24వ తేదీ నుంచే!

భారతదేశంలో మార్చి 22వ తేదీన నెలవంక కనిపించలేదు.ఎందుకంటే ముస్లింలు నెలవంకను చూసి రంజాన్ ఉపవాసాలను మొదలుపెడతారు.

రంజాన్ నెలవంక కనిపించలేదు రంజాన్ మొదటి ఉపవాసం మార్చి 24వ తేదీ నుంచే!

మళ్లీ నెల తర్వాత నెలవంకను చూసిన తర్వాతే ఉపవాసాలను విరమించుకొని రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

నెలవంక మార్చి 22వ తేదీన కనిపించలేదు.కాబట్టి మొదటి ఉపవాసం శుక్రవారం రోజు నుంచి మొదలవుతుంది.

లక్నోలోని ఫిరంగి మహల్ లోని మార్క్‌జీ చంద్ కమిటీ బుధవారం చంద్రుడు కనిపించలేదని అందువల్ల మొదటి రంజాన్ ఉపవాసం మార్చి 24 2023న మొదలవుతుందని తెలియజేసింది.

జమియత్ ఉలేమా-ఎ-హింద్ ట్వీట్ చేస్తూ రంజాన్ మొదటి ఉపవాసం శుక్రవారం మార్చి 24 2023 అని వెల్లడించింది.

మన దేశంలో బుధవారం సాయంత్రం రంజాన్ నెలవంక కనిపించలేదు.కాబట్టి పవిత్ర రంజాన్ మాసం శుక్రవారం నుంచి అధికారికంగా మొదలవుతుంది.

వార్తా సంస్థ పిటిఐ ప్రకారం ఢిల్లీలోని ఫాతేపూరి మసీద్ ఇమామ్ ముఫ్తీ ముకర్రం అహ్మద్ కూడా దేశంలో ఎక్కడా చంద్రుడు కనిపించలేదని వెల్లడించారు.

మార్చి 24 నుంచి ఉపస దీక్షలు( Fasting ) జరుగుతాయని ముంబైకి చెందిన మార్క్‌జీ రుయ్టే హిలాల్ కమిటీ మస్జిద్-ఎ-జామా కూడా తెలిపింది.

"""/" / ఇంకా చెప్పాలంటే ఇస్లామిక్ క్యాలెండర్ లో రంజాన్ 9వ నెల అని దాదాపు ముస్లింలు అందరికీ తెలుసు.

ఈ మాసంలో దాదాపు ప్రజలందరూ ఉపవాస దీక్షను పాటిస్తారు.ఉపవాస సమయంలో నీరు కూడా అసలు సేవించకూడదు.

ప్రజలు అల్లాహ్ ఆరాధన కోసం ఉపవాసం ఉంటారు.రోజాను నిలబెట్టుకోవడం ద్వారా ప్రజలు అల్లాను ఆదరించడానికి ఎక్కువ సమయం లభిస్తుందని నమ్ముతారు.

ఉపవాస సమయంలో ఏ ఒక్కరికి చేతల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ ఆటంకం కలిగించే పని అస్సలు చేయకూడదు.

అంతే కాకుండా చెడు మాటలను మాట్లాడకూడదు.