ప్ర‌పంచంలోనే ఎత్తైన వారిగా ఉన్న ఆ దేశ జ‌నాభా పొట్టివార‌వుతున్నారంట‌..

ఆరడుగుల ఎత్తు ఉన్న వారిని ఆజానుభాహులుగా పిలుస్తుంటారు.ఇలాంటి వారికే అమ్మాయిలు తెగ లైక్ చేస్తుంటారు.

అయితే ఇలా పొడుగ్గా ఉండాల‌ని అంద‌రికీ ఉంటుంది.అయితే ఇలాంటి పొడుగైన వారు ఓ దేశంలో మాత్రం ఎక్కువ‌గా ఉంటారు.

ఆ దేశంలో పురుషులతో పాటు మహిళలు కూడా చాలా ఎత్తుగా అంటే ఆర‌డుగుల వ‌ర‌కు ఉంటారు.

దాంతో ఆ దేశానికి ప్రపంచంలో పొడవైన మ‌నుషులు ఉన్న దేశంగా పేరు వ‌చ్చింది.

అదే నెదర్లాండ్స్‌.ఈ దేశంలో ప్రపంచంలో కెల్లా ఎత్తు అయిన మ‌నుషులు ఉంటారు.

అయితే ఇప్పుడు ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోతోంది.ఇలా ఎత్తైన జనాభా ఉన్న దేశంగా నెద‌ర్లాండ్స్ దాదాపు ఆరు దశాబ్ధాలుగా రికార్డుల‌కు ఎక్కింది.

కానీ ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోతున్న‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే తాజాగా జ‌రిపిన అధ్యయనంలో వీరంతా పొట్టిగా మారుతున్న‌ట్టు తెలిసింది.

ఈ దేశంలో మునుపటి తరం మ‌నుషుల కంటే కూడా ఈ త‌రం మ‌నుషులు వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా ఎత్తు త‌గ్గుతున్నారంట‌.

1980 శ‌కంలో జీవించిన వారితో పోలిస్తే 2001శ‌కంలో పుడుతున్న వారా కొంచెం పొట్టిగా ఉంటున్నారని తెలుస్తోంది.

"""/"/ 1980లో ఉన్న పురుషుల‌తో పోల్చిన‌ప్పుడు 2001లో జీవిస్తున్న వారు కనీసం 1 సెంటీ మీటర్ హైట్ త‌క్కువ‌గా ఉన్నార‌ని ఈ స‌ర్వేలో తెలుస్తోంది.

ఇక ఈ దేశంలో మహిళల విష‌యానికి వ‌స్తే దాదాపుగా 1.4 సెం.

మీ వ‌ర‌కు ఎత్తు తగ్గిపోయార‌ని స‌ర్వే వివ‌రించింది.అయితే ఈ విధ‌మైన అంశాల గురించి తెలుసుకునేందుకు నెద‌ర్లాండ్స్ లోని 19 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వారిని ప‌రిశీలించగా ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

కావాల్సినంత పౌష్టికాహారం ఇప్ప‌టి త‌రానికి అంద‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలా ఎత్తు త‌గ్గిపోతున్నార‌ని తేలింది.

ఇప్ప‌టి త‌రం వారు ఈ విధ‌మైన పోష‌కాహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి ప‌రిస్థితులు వ‌స్తున్నాయంట‌.

ఏపీలో దూకుడు పెంచుతోన్న బీజేపీ .. భారీగా  స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు