కౌంట్ డౌన్ షురూ…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:లోక్ సభ ఎన్నికలతో( Lok Sabha Elections ) పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల( Assembly Elections ) నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.
మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది.
తొలి దశ ఎన్నికల్లో 21 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.ఏపీ,తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది.
మే 13 న పోలింగ్ జరుగుతుంది.ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది.
అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి.అయితే,బీఫామ్ చేతికి వచ్చేంత వరకు కొందరు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి ఉంది.
ఏపీ, తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్( Telangana Election Schedule ) ను పరిశీలిస్తే.
ఏప్రిల్ 18 న నామినేషన్ల స్వీకరణ,ఏప్రిల్ 25 న నామినేషన్లకు చివరి తేదీ,ఏప్రిల్ 26 న నామినేషన్ల పరిశీలన,ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ,మే 13 న పోలింగ్,
జూన్ 4 న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వదిలి.. కుంభమేళా బాట పట్టిన మేధావి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!