నటి శోభిత కౌంట్ డౌన్ మొదలు… ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత?
TeluguStop.com
సినీ నటి శోభిత(Sobhita ) త్వరలోనే నటుడు నాగచైతన్య(Nagachaitanya) తో కలిసి ఏడు అడుగులు నడవబోతున్నారు.
సమంత (Samantha) కు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభిత ప్రేమలో పడ్డారు.
ఇలా పలు సందర్భాలలో వీరిద్దరూ జంటగా కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా హల్చల్ చేశాయి.
ఇలా వీరి రిలేషన్ గురించి ఎన్నో వార్తలు వినిపించిన వీరిద్దరూ మాత్రం ఈ వార్తలపై ఎప్పుడు స్పందించిన దాఖలాలు లేవు.
ఇలా వీరిద్దరి గురించి వార్తలు వస్తున్న తరుణంలోనే శోభిత నాగచైతన్య కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
ఈ విధంగా వీరి నిచ్చితార్థం జరగడంతో పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.
వీరి పెళ్లికి సంబంధించి ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన వెలబడలేదు కానీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోనే జరగబోతుందని తెలుస్తోంది.
ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నట్టు సమాచారం.
"""/" /
ఇక శోభిత ఇంట్లో కూడా పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి ఇటీవల ఈమె పసుపు దంచే వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
తాజాగా శోభిత చెల్లెలు డాక్టర్ సమంత (Sobhita's Younger Sister Is Dr.
Samantha)వీరి పెళ్లికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు.శోభిత పసుపు దంచే వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత ఆ ఫోటోలకు ది కౌంట్ డౌన్ బిగిన్స్(The Count Down Begins ) అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
దీంతో వీరి పెళ్లి (Marriage) త్వరలోనే జరగబోతుందని తెలుస్తోంది.ఇక ఈ ఫోటోలపై పలువురు స్పందిస్తూ పెళ్లి తేది గురించి క్లారిటీ ఇవ్వండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది…