ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిన సంధర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నేత.. ?
TeluguStop.com
గెలుపు ఓటములు అనేవి మనుషులతో ఆడే ఆటలు.కానీ రాజకీయాల్లో మాత్రం డబ్బులుంటే ఎలాంటి పదవులైన వరిస్తాయని, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ డబ్బులే మూల కారణం అని కొందరు నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
కాగా తాజాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి వాటి ఫలితాలు కూడా వెలువడుతున్న సంగతి విదితమే.
అయితే ఈ ఎన్నికల్లో వనపర్తి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలోకి దిగారు.
తనకు ఓటు వేయాలని అభ్యర్ధించారు.గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.
కానీ చివరికి వచ్చిన ఫలితం శూన్యం.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి ఓటమి మూటగట్టుకున్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఇక నుండి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో డబ్బుల రాజ్యం నడుస్తుందని.డబ్బులు పంచితేనే ఓట్లు రాలుతాయని నిరూపించబడిందని ఆరోపించారు.
ఈ పట్టబద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన నేను డబ్బులు పమచలేక పోవడం వల్లే ఓడిపోయానని, కాబట్తి డబ్బులు లేని వారు ఎన్నికల్లో దయచేసి పోటీ చేయవద్దని కోరారు.
ఇక నిరుద్యోగులు అధికార పార్టీ డబ్బులకు లొంగిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.నేటి రాజకీయాలు డబ్బుతో ముడిపడి సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.