కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం
TeluguStop.com
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.కంఠీరవ స్టేడియంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య ప్రమాణ స్వీకారం చేశారు.
తరువాత డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు.మంత్రులుగా పరమేశ్వర, కేజే జార్జ్, మునియప్ప, ఎంబీ పాటిల్ లు ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు శరద్ పవార్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, బీహార్ సీఎంలు హాజరయ్యారు.
అదేవిధంగా సీతారాం ఏచూరి, డి.రాజా, కమల్ హాసన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!