కేసీఆర్ దెబ్బకు వారంతా విలివిల ?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు సామాన్యులకే కాదు,  తలలు పండిన రాజకీయ పండితులకు కూడా అర్థం కాదు.

సందర్భం కు అనుగుణంగా ఎత్తులు,  పై ఎత్తులు వేస్తూ,  తమ రాజకీయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం లో కెసిఆర్ దిట్ట.

ఆ రకమైన ఎత్తుగడల కారణంగానే,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిఆర్ఎస్ పార్టీని స్థాపించి , ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేపట్టి,  చివరకు ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది.

విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది.  2019 వరకు ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేకపోయినా, 2018 లోనే ముందస్తు ఎన్నికలకు కెసిఆర్ వెళ్లారు.

రెండోసారి అనుకున్నట్టుగానే విజయం సాధించారు.వచ్చే ఏడాది  తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా,  కాస్త ముందుగానే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారనే ప్రచారం టిఆర్ఎస్ రాజకీయ శత్రువులైన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు  నిద్రలేకుండా చేస్తున్నాయి.

అసలు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేదా అనేది సరైన క్లారిటీ లేక పోవడంతో,  మరింత కంగారు పుట్టిస్తోంది.

దీంతో అన్ని రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపయాయి.అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఎదుర్కొనే వ్యూహంలో పైనే విపక్షాలు దృష్టిసారించాయి.

  """/"/ ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు .

జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు.

  ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు అని మెజారిటీ నాయకులు నమ్ముతున్నారు.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని , డిసెంబర్ లోనే ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం తో,  అసలు ముందస్తు ఎన్నికలు జరుగుతాయా ? సాధారణ ఎన్నికలే జరుగుతాయా అనేది టిఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్ధులకు అర్థం కావడం లేదు అందుకే ముందు జాగ్రత్తగా ముందస్తు ఎన్నికల సమరంలో గట్టెక్కేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

వైరల్ న్యూస్: కడుపులో ఇనుప సామాను.. దిబ్రాంతికి గురైన వైద్యులు..