ఆ కంపనీ ఉద్యోగుల ఆందోళన.. అసలు మ్యాటరెంటంటే..?!

ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రత మరియు మెరుగైన పని పరిస్థితులు తమకు కల్పించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ కొరియా ప్రధాన కార్మిక గ్రూపు- కొరియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కార్మికులు ఆందోళనలు చేపట్టారు.

సియోల్ డౌన్‌టౌన్‌ తో సహా దేశవ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు మిన్నంటాయి.ఉపాధి కల్పన, మెరుగైన పని పరిస్థితులు తమకు కల్పించాలంటూ డ్రమ్స్ ప్లే చేస్తూ ఆందోళనలో కార్మికులు పాల్గొన్నారు.

వీరందరూ నెట్ ఫ్లిక్స్ మెగాహిట్ స్క్విడ్ గేమ్ సిరీస్ లో నటించిన నటుల మాదిరిగా జంప్ సూట్స్ మరియు మాస్క్ లు ధరించి బుధవారం రోజున దక్షిణ కొరియాలో ఆందోళనలో పాల్గొన్నారు.

స్క్విడ్ గేమ్ సిరీస్ లోని నటులు ధరించిన మారదిరిగా తెల్లని వృత్తం, చతురస్రం, త్రిభుజం చిహ్నాలతో కూడిన మాస్క్ లు ధరించి ఆందోళనలు చేపట్టారు.

అలాగే ఇన్ ఈక్వాలిటీ అవుట్, సేఫ్ యూత్ ఎంప్లాయిమెంట్, క్వాలిటీ యూత్ ఎంప్లాయిమెంట్ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు.

"""/"/ సుమారు 80 మంది యూనియన్ సభ్యులు ఎలా స్క్విడ్ గేమ్‌ మాదిరిగా ఉన్న దుస్తులను ధరించి ఆందోళన చేపట్టారు.

ఇలా అందరు ఒక చోట గుమిగూడి ఆందోళనలు చేయడం అనేది కోవిడ్ -19 ఆంక్షలను ధిక్కరించడమే అవుతుంది అని సియోల్ సిటీ గవర్నమెంట్ KCTU సభ్యులపై గురువారం పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ దాఖలు చేసారు.

సింహాచలం చేరుకున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సీఎం రమేష్