Australia : ప్రేమలేఖలను టాయిలెట్ పేపర్లుగా మార్చుతున్న కంపెనీ.. ఎందుకో తెలిస్తే..

సాధారణంగా బ్రేకప్ అయిపోయిన తర్వాత మాజీ ప్రియుడు లేదా ప్రియురాలి జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేయాలని చాలామంది అనుకుంటారు.

ముఖ్యంగా ప్రేమ లేఖలను ధ్వంసం చేయాలని కోరుకుంటారు.అలాంటి వారిలో మీరు కూడా ఒకరా.

వదిలించుకోవాలనుకునే మాజీ లవర్ పాత ప్రేమ లేఖలు మీ వద్ద ఉన్నాయా? అయితే ఆస్ట్రేలియా( Australia )లోని ఒక టాయిలెట్ పేపర్ కంపెనీ మీ కోసం ఒక అదిరిపోయే పరిష్కారాన్ని అందించింది.

దాని పేరు "ఫ్లష్ యువర్ ఎక్స్". """/" / హూ గివ్స్ ఎ క్రాప్ ( WGA ) అనేది ఆ కంపెనీ పేరు.

వారు రీసైకిల్ కాగితం నుంచి టాయిలెట్ పేపర్‌ను తయారు చేస్తారు.వాలెంటైన్స్ డే ( Valentine S Day )సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ను కంపెనీ ప్రకటించింది.

ఆఫర్ కింద లవర్స్‌ పాత ప్రేమ లేఖలను పంపితే ఈ కంపెనీ వాటిని టాయిలెట్ పేపర్‌గా మారుస్తుంది.

గత సంబంధాల నుంచి ముందుకు సాగడానికి ఇది మాజీ ప్రేమికులకు సహాయపడుతుందని కంపెనీవారు అంటున్నారు.

ప్రేమ లేఖలను ఎవరైనా తమ మలాన్ని తుడిచివేయడానికి ఉపయోగిస్తున్నారని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని వారు అంటున్నారు.

"""/" / మీరు ఫిబ్రవరి చివరి వరకు ఈ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు.ఈ కంపెనీ ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌ల( Australia, UK )లో కార్యాలయాలను కలిగి ఉంది.

మీరు మీ ప్రేమ లేఖలను వాటిలో దేనికైనా మెయిల్ చేయవచ్చు.అయితే ఈ ప్రేమికుల రోజున మీ మాజీ లవర్లను వదిలించుకోవడానికి ఇది ఏకైక మార్గం కాదు.

మిగతా కంపెనీలు కూడా ఇతర ఎంపికలు ఆఫర్ చేస్తున్నాయి.అయితే టాయిలెట్ పేపర్ గా ప్రేమలేఖలను మార్చే ఐడియా కొంతమందికి నచ్చితే మరి కొంతమందికి మాత్రం నచ్చలేదు.

మరి భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఐడియాతో కంపెనీలు ముందుకు వస్తాయో చూడాలి.

అధిక బ‌రువు ఉన్న‌వారు డ్రాగ‌న్ ఫ్రూట్ తింటే ఏమ‌వుతుందో తెలుసా?