హలియా హాస్పటల్ ను సడన్ విజిట్ చేసిన కలెక్టర్

నల్లగొండ జిల్లా( Nalgonda District ):అనుముల మండలం హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ( Narayana Reddy )ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైరాజరైన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ ఎస్.సురేందర్ ను అక్కడిక్కడే సస్పెండ్ చేశారు.

సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి,వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో ముఖాముఖి మాట్లాడిన ఆయన ఆసుపత్రి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

సబ్ సెంటర్ ఔట్ పేషెంట్ వివరాలు కనుక్కున్నారు.ఆ రోజు వరకు ఎంత మంది గర్భిణి స్త్రీలు నమోదయ్యారని సబ్ సెంటర్ల వారీగా ఇన్చార్జిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎన్ని ప్రసవాలు చేశారని ఆరా తీసి,ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలు,ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలపై సమీక్షించారు.

గర్భిణీ స్త్రీలందరినీ నమోదు చేయాలని ఆదేశించారు.గ్రామస్థాయిలో మంచి వైద్య సేవలు అందిస్తే ప్రజల మనుషుల్లో గుర్తుండిపోతారని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలపై ప్రజలు నమ్మకం పెంచండని కోరారు.మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలన్నారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను పరిశీలించాలని, ప్రత్యేకిం‌చి చిన్నపిల్లల, గర్భిణీ స్త్రీలు,బాలింతలకు ఇస్తున్న ఆహార,ఐరన్ మాత్రలు అందుతున్నవా లేవా పరిశీలించాలన్నారు.

సీజన్ వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని గ్రామాలు తిరగాలని ఆదేశించారు.ఆశావర్కర్లు,అంగన్వాడి కార్యకర్తలకు మాత శిశు సంరక్షణపై పూర్తి అవగాహనతో పాటు బర్త్ ప్లాన్ పై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?