బీజేపీలో ఇంకా ఆ క్లారిటీ రాలేదా ? ఇలా అయితే కష్టమేనా ?
TeluguStop.com
తెలంగాణలో జరగబోతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక పాటు కాంగ్రెస్ లోనూ ఇటు టిఆర్ఎస్ పార్టీలోను పొలిటికల్ హిట్ పెంచుతోంది.
రెండు పార్టీలు ఎవరికి వారు ఎక్కడా తగ్గకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం మొదలు పెట్టేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.ఈ విషయంలో పార్టీ సీనియర్లంతా ఒకరిని ప్రతిపాదిస్తే రేవంత్ మరొకరిని ప్రతిపాదించారు.
ఏమైతేనేమి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఒక క్లారిటీ వచ్చేసింది.ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించడం తోపాటు బి ఫాం కూడా ఇచ్చేసింది కానీ తెలంగాణలో బలపడి బలపడాలని తెగ ఆరాటపడుతున్న కేంద్ర అధికార పార్టీ బీజేపీ మాత్రం ఈ విషయంలో బాగా వెనకబడి పోయింది.
"""/"/ ఇప్పటివరకు ఆ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థిని కూడా ప్రకటించలేకపోయింది.
హుజూర్ నగర్ ఉప ఎన్నికలు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పాటీలు పడుతున్నాయి.
అయితే ఈ రెండు పార్టీలు మాత్రం బీజేపీని అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న బిజెపి మాత్రం ఆ దిశగా వేగంగా అడుగులు వేయలేకపోతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితమైన బిజెపి ఆ తరువాత కొంచెం వేగం పుంజుకుని పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లను సొంతం చేసుకుంది.
అప్పటి నుంచి తెలంగాణ బిజెపి స్పీడ్ పెరిగినట్టు కనిపించింది. """/"/ ఇతర పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల అందరిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసి అనుకున్న మేరకు సక్సెస్ అయ్యింది.
ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బిజెపి జెండా రెపరెపలాడితేనే ఆ పార్టీ మరింత బలోపేతం అవుతుంది.
కానీ ఓడిపోతే బిజెపి తెలంగాణలో ఎదుగుదలకు అనేక అడ్డంకులు ఏర్పడతాయి.అందుకే కే ఉప ఎన్నికల పోరులో అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో బిజెపి నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందిన హుజూర్ నగర్ అభ్యర్థి బోడ భాగ్యరెడ్డి ని పోటీకి దింపితే సంపతి బాగా లభిస్తుందని బిజెపి నాయకులు అంచనా వేస్తున్నారు.
బోడ భాగ్యరెడ్డి తో పాటు డాక్టర్ కోట రామారావు, అప్పి రెడ్డి తదితర నాయకుల పేర్లను కూడా బీజేపీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటోంది.
5000 మందికి సహాయం చేసిన ప్రముఖ నిర్మాత.. ఈయన మనస్సుకు గ్రేట్ అనాల్సిందే!