మొబైల్ యూజర్లను టార్గెట్ చేసిన చైనీయులు.. ఆ తప్పు చేస్తే అంతే సంగతులు..!

ఇండియాలో దీపావళి పండుగ చేసుకుంటున్న వేళ చైనీయులు భారత యూజర్లను టార్గెట్ చేస్తున్నారు.

హ్యాపీ దివాలీ అనే మెసేజ్‌లు పంపిస్తూ బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులు కాజేస్తున్నారు.సాధారణంగా ఈ రోజు ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీల మధ్య దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం సహజం.

ఇదే క్రమంలో వీరు కూడా సేమ్ ఇలాగే మెసేజ్‌లు పంపిస్తున్నారు.ఈరోజు చాలా నంబర్ల నుంచి ఇలాంటి మెసేజ్ లు వస్తాయి.

కాబట్టి అవి స్నేహితుల నుంచే వచ్చాయని నమ్ముతుంటారు.సైబర్ నేరగాళ్లు పంపించారనే విషయం కనుక్కోలేరు.

అయితే ఈ మెసేజ్‌లలోని లింక్‌పై క్లిక్ చేస్తే అంతే సంగతులు అని తాజాగా ఇండియన్ గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ కమిటీ హెచ్చరించింది.

చైనాకి చెందిన కొన్ని వెబ్‌సైట్లు ఇండియన్ మొబైల్ యూజర్లను.ముఖ్యంగా మహిళలను ఈ లింక్‌ల మెసేజ్‌లతో టార్గెట్ చేస్తున్నాయి.

ఆ మెసేజ్‌లలోని ఫలానా లింక్‌పై నొక్కగానే దీపావళి గిఫ్ట్స్ సొంతం చేసుకోవడానికి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలను సబ్మిట్ చేయాలని అడుగుతారు.

అయితే కొందరు ఏదైనా ఇది నిజమేనని దీపావళి గిఫ్ట్ పొందాలనుకుని వివరాలన్నీ ఇచ్చేస్తున్నారు.

అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా ఇవ్వొద్దని ఇండియన్ సైబర్ సెక్యూరిటీ కమిటీ హెచ్చరించింది.

పొరపాటున వివరాలు అందించిన పక్షంలో బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

"""/"/ దీపావళి సందర్భంగా చాలా మంది జ్యువలరీ కొనుగోలు చేయాలని అనుకుంటారు.ఈ విషయాన్ని గమనించిన సైబర్ కేటుగాళ్లు బంగారం ఫ్రీగా ఇస్తామని నమ్మబలికి డబ్బులు మొత్తం కాజేస్తున్నారు.

కొన్ని కంపెనీల లోగోలతో ఫేక్ వెబ్‌సైట్ నుంచి కూడా ఇలాంటి ఎటాక్స్ జరుగుతున్నాయి.

అందువల్ల ఈ దీపావళి సందర్భంగా ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది.

లేదంటే ఈ రోజు వారి జీవితంలో చీకటి మిగులుతుంది.

తమ గుంపును కాపాడుకోవడానికి ప్రాణ త్యాగం చేసిన అడవి దున్న.. అంతలోనే వెన్నుపోటు..?