పట్టాలపై పడిపోయిన చిన్నారి.. అంతలోనే దూసుకొచ్చిన ట్రైన్.. చివరికి..

రైల్వే స్టేషన్‌లో( Railway Station ) అజాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

కానీ కొందరు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు.రైలు వస్తుంటేనే పట్టాలు దాటుతుంటారు.

ఈ సమయంలో కింద పడటం లేదా పట్టాలపై పడటం ఆపై రైలు వచ్చి తొక్కేసి వెళ్ళిపోవడం వంటి ఘటనలు జరుగుతుంటాయి.

ఇప్పటికే ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు.ఇటీవల ఒక తల్లి ట్రైన్ వస్తుండగా పట్టాలు దాటడానికి ప్రయత్నించింది.

ఆ సమయంలో పొరపాటున బిడ్డను పట్టాల మీద పడేసింది.అంతలోనే ఒక ట్రైన్ అదే పట్టాల మీదకు దూసుకొచ్చింది.

అదృష్టం కొద్దీ బిడ్డ పట్టాల మధ్యలో పడ్డాడు కానీ పట్టాలపై పడలేదు.అందువల్ల చక్రాలు బిడ్డను తొక్కలేదు.

దాంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. """/" / ఈ ఘటనకు సంబంధించిన వీడియోను @casiMueren అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

దీనికి ఇప్పటికే 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే, వెళ్తున్న ఓ ట్రైన్, దానికిందే పట్టాల మధ్యలో ఒక పసిబిడ్డ కనిపించడం మనం చూడవచ్చు.

ట్రైన్ వెళ్లిపోయాక ఒక వ్యక్తి దిగి బిడ్డను పైకి తీసుకొచ్చాడు.అనంతరం ఆ చిన్నారిని చేతుల్లోకి కొందరు మహిళలు తీసుకున్నారు.

అంత పెద్ద ప్రమాదం ఎదురైనా బాలుడికి ఏమీ కాకపోవడంతో ప్రజలు సంతోషించడం మనం గమనించవచ్చు.

"""/" / పోలీస్ కూడా ఈ ప్రజల గుంపులో కనిపించారు.ఈ ఘటన భారతదేశంలోనే( India Itself ) జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వీడియో చూసిన చాలామంది ఏ తల్లి తన బిడ్డను పట్టాల మీద అలా పడేయదు అని కామెంట్లు పెడుతున్నారు.

అసలు ఆ చిన్నారి ఆ పట్టాల మధ్యలోకి ఎలా వెళ్ళింది అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

దేవుడి దయవల్ల బిడ్డకు ఏమీ కాలేదు అని మరి కొందరు రిలీఫ్ గా కామెంట్స్ చేశారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

కోలీవుడ్ ఇండస్ట్రీకి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన సుకుమార్… తిరుగుండదంటూ!