ఐదేళ్లకే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చేరిన చిన్నారి ..!

కొంతమంది చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ, నైపుణ్యం కలిగి ఉంటారు.ఆటలాడుకునే వయస్సులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి పిట్ట కొంచెం కూత ఘనం అని.

అనిపించుకుంటుంది ఈ బుడతది.చిన్నతనం నుండి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలో దాగిఉన్న టాలెంట్ ని గుర్తించి దానికి అనుగుణంగా వారిని ప్రోత్సహిస్తుంటారు.

చిన్నప్పటి నుంచి తమ పిల్లలని సరైన విద్యాబుద్ధులు, క్రమ శిక్షణ అలవాటు చేస్తుంటారు.

దీంతో అది క్రమంగా వారికి అలవాటు అవుతుంది.ఇలాంటి తల్లిదండ్రుల పిల్లలు చిన్న వయసులోనే గొప్ప స్థాయికి చేరుకుంటారు.

ఈ కోవకు చెందిన ఒక స్పూర్తిదాయకమైన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.వెస్ట్ బెంగాల్ లోని మిడ్నాపూర్ లో అనిరుద్ధ ఘోష్, సంపాతి ఘోష్ దంపతులు నివాసముంటున్నారు.

అనిరుద్ద ఘోష్ పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు.వీరికి ఆత్రేయ ఘోష్ అనే ఐదేండ్ల పాప ఉంది.

చిన్నతనం నుండే తమ పాపకు వారు కథలు, పజిల్స్ చెపుతుండేవారు.సాధారణంగా ఐదేండ్ల వయసులో పిల్లలు ఏబీసీడీ లు చెప్పడానికే తెగ ఇబ్బందిపడుతుంటారు.

అలాంటిది.ఈ చిన్నారి మాత్రం.

ఇంగ్లీష్ అక్షరాల లోని లెటర్స్ లను ఎలాంటి తప్పులు లేకుండా చెప్పడమే కాకుండా ఇంగ్లీష్ అకర మాలలోనిన లెటర్స్ లను రివర్స్ లో కూడా తప్పులు లేకుండా చెప్పేస్తుంది.

ఈ ఘనతను కేవలం 23 సెకన్లలోనే పూర్తి చేస్తుంది.ఈ అరుదైన రికార్డుకు గాను.

ఆత్రేయ ఐదేండ్లలోనే 2022 లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సాధించింది.

ఈ సందర్భంగా చిన్నారి గురించి తల్లిదండ్రులు మాట్లాడుతూ.ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మా కూతురు చేరడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని తెలిపారు.

తమ పాపను చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, నృత్యం, పఠనం తదితర వాటిలో మంచి ట్రైనింగ్ ఇస్తున్నామని బాలిక తల్లిదండ్రులు తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించేలా తమ పాపను ప్రొత్సహిస్తున్నామని అనిరుద్ధ తెలిపారు.

ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : హరీష్ రావు