తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలకలం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు.

మెట్టు మార్గంలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించింది.ఈ క్రమంలో చిరుత సంచారంపై టీటీడీ సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు.

అయితే ఇటీవల తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే అధికారులు ఆపరేషన్ చిరుత పేరుతో సుమారు ఐదు చిరుతలను బంధించిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేశారా.. నిన్న నాగార్జున నేడు బన్నీ.. ఎక్కడ చెడింది?