ఉమ్మడి కృష్ణా వైసీపీలో ముదురుతున్న సీట్ల మార్పు ముసలం..!!

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైసీపీలో సీట్ల మార్పు ముసలం మరింతగా ముదురుతోంది.సీటు మార్పుపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలక వహించారని తెలుస్తోంది.

దీంతో మల్లాది విష్ణును పార్టీ పెద్దలు బుజ్జగించే పనిలో పడ్డారు.ఈ మేరకు సజ్జల, అయోధ్య రామిరెడ్డితో పాటు మర్రి రాజశేఖర్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

ఇవాళ సీఎం జగన్ ను మల్లాది విష్ణు కలవనున్నారని తెలుస్తోంది.మరోవైపు విజయవాడ సెంట్రల్ కు మార్చిన వెల్లంపల్లి సైతం జగన్ ను కలిశారు.

మల్లాది విష్ణు సపోర్ట్ లేకుండా ఆ నియోజకవర్గం నుంచి గెలుపు సాధ్యం కాదని వెల్లంపల్లి భావిస్తున్నారు.

అలాగే మరో వైసీపీ నేత పార్థసారథి చాలాకాలంగా టీడీపీతో టచ్ లో ఉన్నారని సమాచారం.

ఈనెల 18న కే పార్థసారథి టీడీపీలోకి చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

పూరీ జగన్నాధ్ ను కాదని చిరంజీవి శ్రీకాంత్ ఒదెలకి ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి..?