తుమ్మినప్పుడు కళ్లు మూయనని ఛాలెంజ్.. తర్వాత ఏమైందంటే..?
TeluguStop.com
జలుబు చేసినప్పుడు బాగా తుమ్ములు వస్తూ ఉంటాయి.అలాగే సాధారణంగా కూడా తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి.
తుమ్ము వచ్చినప్పుడు కళ్లు ఆటోమేటిక్ గా మూసుకుపోతూ ఉంటాయి.తుమ్ము వచ్చినప్పుడు కళ్లు తెరిచి ఉంచడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు.
కానీ అది సాధ్యమేనని నిరూపించింది ఒక అమ్మాయి.ఈ అమ్మాయి చేసిన ఫీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఒక అమ్మాయికి తుమ్ము వచ్చినప్పుడు కళ్లు ( Eyes )తెరిచి ఎందుకు ఉంచకూడదనే ఆలోచన వచ్చింది.
దీంతో తుమ్ము వచ్చినప్పుడు కళ్లు తెరిచి ఉంచుకుని వీడియో తీసింది.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
తుమ్ము రావడం కోసం ఈ అమ్మాయి పెన్నును ముక్కులో పెట్టుకుంది.ఆ తర్వాత తుమ్ము( Sneeze ) రాగానే కళ్లు మూయకుండా తుమ్మింది.
కనురెప్పులు కాస్త కదిలినట్లు వీడియోలో కనిపిస్తుండగా కళ్లు మాత్రం మూయకుండా అలాగే ఉండగలిగింది.
"""/" /
ఈ ఛాలెంజ్ పూర్తి కాగానే ఈ అమ్మాయికి బాగా నవ్వు వచ్చింది.
ఈ వీడియోకు నెటిజన్లు అనేక రకాల కామెంట్స్ పెడుతున్నారు.తుమ్ము తెప్పించుకోవడానికి మేకప్ బ్రష్ ను వాడాలా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
ఇక మరికొంతమంది నకిలీ వీడియోలను పోస్ట్ చేసే వ్యక్తుల కంటే ఇలాంటి అసలైన వీడియోలు ఫన్నీగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.కొంతమందికి తుమ్ము మీద అనేక నమ్మకాలు ఉంటాయి.
పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే ఆ పని జరగదని, గడప మీద కూర్చుని తుమ్మకూడదని చెబుతూ ఉంటారు.
అలాగే కొంతమంది తుమ్మను బలవంతంగా ఆపుకుంటూ ఉంటారు.ఇలా ఆపుకోవడం వల్ల నరాలు దెబ్బతింటాయని చెబుతున్నారు.
బిగ్బాస్-8: వరస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్.. సంబరాలు చేసుకుంటున్న ప్రేక్షకులు..?