దేశ ప్రజలకు కేంద్రం పిలుపు.. ఆ రోజు 2 నిమిషాలు మౌనం పాటించాలని ఆదేశం..!

కేంద్రం ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలు చిత్రంగా అనిపిస్తాయి.కరోనా సమయంలో దేశ ప్రజలంతా జ్యోతిలు వెలిగించాలని, చప్పట్లు కొట్టాలని ఇలా పలు రకాలైన ఆదేశాలను ప్రధాన మంత్రి ఇవ్వడం కొందరికి నచ్చుతుంది.

మరికొందరికి నచ్చడం లేదు.అయినా మన ప్రధాన మంత్రి గారు మాత్రం తనపని తాను చేసుకుంటూ వెళ్లుతున్నారు.

ఇకపోతే జాతిపిత గాంధీ వర్ధంతి రోజైన జనవరి 30న అమరవీరుల సంస్మరణదినంగా జరుపు కోడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతుందట.

బానిస సంకెళ్ల నుండి భరతమాత విముక్తి కోసం ఎందరో స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలను త్యాగం చేశారు.

ఆ త్యాగమూర్తుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్న నేపధ్యంలో, జనవరి 30న దేశ ప్రజలందరూ 2 నిముషాలు మౌనం పాటించాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ప్రతి ఏడాది జనవరి 30న దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటలకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించాలని జనవరి 18న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా కోరిన విషయం తెలిసిందే.

ఏపీలో విపక్ష కూటమి ‘ఉమ్మడి మ్యానిఫెస్టో రిలీజ్.. దూరంగా బీజేపీ..!!