మార్చి ఫస్ట్ నుండి 60 ఏళ్లు పైబడిన వారు రెడీ అవ్వాలి అంటున్న కేంద్రం..!!

దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ లో కరోనా సమయంలో విధులు నిర్వహించిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ముమ్మరంగా కేంద్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రపంచంలో ఏ దేశంలో జరగని రీతిలో పంపిణీ కార్యక్రమం ఇండియాలో లో చాలా స్పీడ్ గా జరుగుతూ ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మార్చి ఫస్ట్ కి దేశవ్యాప్తంగా 60 సంవత్సరాల పైబడిన వారు రెడీగా ఉండాలని ప్రకటన చేశారు.

అంతమాత్రమే కాకుండా 45 ఏళ్ల పైబడిన వ్యక్తులకు కూడా వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు.

ప్రభుత్వ సెంటర్లలో ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.ప్రైవేట్ హాస్పిటల్ లో వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకునేవాళ్ళు డబ్బులు చెల్లించాలని జవదేకర్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ లో అయితే డబ్బు చెల్లించాలి.అది ఎంత అన్నదానిపై రెండు మూడు రోజుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడిస్తోంది అని తెలిపారు .

పరీక్షకు నిమిషాల ముందు షాక్.. హాల్ టికెట్ తన్నుకుపోయిన గద్ద.. చివరి క్షణంలో ఏమైందంటే..?