మరణం నుండి మనుషులను కాపాడిన సెల్.. ఎలాగంటే.. ?
TeluguStop.com
ఇన్నాళ్లూ కాపురాలను కూల్చిన, మనుషుల ప్రాణాలను తీస్తున్న సెల్ ఫోన్ల గురించే విన్నాం.
కానీ ఒక్క సెల్ ఫోన్ కాల్ 12మంది ప్రాణాలు కాపాడిన ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ధౌలిగంగా నది దాల్చిన ఉగ్రరూపం ఉత్తరాఖండ్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమేలి తపోవన్ పవర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న ఓ అండర్ గ్రౌండ్ టన్నెల్‌లో 12 మంది వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు.
ముంచుకొచ్చే ప్రమాదం గురించి తెలియని వారు తమ పనిలో నిమగ్నం అయ్యారు.పొంచి ఉన్న ప్రమాద విషయం గ్రహించిన అధికారులు అక్కడ పనిచేస్తున్న వారిని బయటకు రావాల్సిందిగా హెచ్చరించారు.
కానీ ఈ లోపలే వరద నీరు టన్నెల్‌లోకి చేరి ఆ మార్గాన్ని బురదతో కప్పేసింది.
ఇకలోపల ఉన్నవారు ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని సజీవసమాధి అవడం ఖాయమని భావిస్తున్న తరుణంలో సడెన్‌గా ఒక వ్యక్తి దగ్గర సెల్ ఫోన్ ఉన్న విషయం గుర్తుకు వచ్చిందట.
వెంటనే అతను కంపెనీకి కాల్ చేసి తమ పరిస్థితిని వివరించాడు. """/"/
ఈ విషయాన్ని కంపెనీ జీఎం ఐటీబీపీ అధికారులకు చెప్పడంతో వారు టన్నెల్ వద్దకు చేరుకుని బురదను తొలగించి వర్కర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారట.
ఆ తర్వాత వీరందరిని ఐటీబీపీ ఆస్పత్రికి తరలించారట.చూశారా ఫోన్ మనుషులను చెడగొడుతుందని నిందలు వేస్తారే గానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోక మనుషులు చెడిపోతున్నారన్న విషయం గ్రహించరని అంటున్నారట కొందరు.
గేమ్ ఛేంజర్ రెండు రోజుల కలెక్షన్ల లెక్కలివే.. రెండో రోజు ఎంత వచ్చాయంటే?