రాజకీయంగా నష్టపోవడానికి కారణం కడియం శ్రీహరి..: తాటికొండ రాజయ్య

వరంగల్ లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య( Tatikonda Rajaiah ) సవాల్ విసిరారు.

కడియం శ్రీహరికి( Kadiyam Srihari ) దమ్ముంటే రాజీనామా చేసి రావాలని తాటికొండ రాజయ్య ఛాలెంజ్ చేశారు.

ఈ మేరకు స్టేషన్ ఘనపూర్( Station Ghanpur ) నియోజకవర్గంలో ఇద్దరం పోటీ చేసి తేల్చుకుందామని పేర్కొన్నారు.

నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రీహరిని భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

అంతేకాకుండా తాను రాజకీయంగా నష్టపోవడానికి కూడా కడియమే కారణమని ఆరోపించారు.దళిత ద్రోహి కడియం శ్రీహరి అన్న తాటికొండ రాజయ్య దమ్ముంటే తన ఛాలెంజ్ ను స్వీకరించి పోటీకి రావాలని తెలిపారు.

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి దిల్ రాజు క్లారిటీ ఇదే.. ఆ రెండు పండుగలే టార్గెట్ అంటూ?