పవన్ మద్దతు అక్కరలేదన్నట్టు మాట్లాడుతున్న బండి.. ఎందుకిలా..?
TeluguStop.com
బీజేపీ పార్టీ అవసరమైతే ఎవరితో అయినా కలిసిపోగలదనే పేరు ఉంది.పట్టులేని చోట బలపడేందుకు ఆ పార్టీ ఎన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తుందో అందరికీ తెలిసిందే.
ఇక ఇప్పుడు తమకు కనీసం పట్టులేనటువంటి ఏపీలో బలపడేందుకు జనసేనతో పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఇటు తెలంగాణలో మాత్రం బీజేపీ వ్యవహారం చాలా భిన్నంగా ఉంది.ఇప్పుడు తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఎంత కీలకంగా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే.
ఇలాంటి వాతావరణంలో అసలు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉంటున్న బీజేపీ ఏం చేస్తుందో అనే టాక్ నడుస్తోంది.
ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అధికార టీఆర్ ఎస్ పార్టీ ఇక్కడ గెలవడం కంటే కూడా బీజేపీకి మాత్రం ఇక్కడ పాగావేయాలంటే మాత్రం కచ్చితంగా గెలవాల్సిందే.
లేదంటే దానికి అసలు భవిష్యత్తే ఉండదు.అయితే ఇప్పుడు తమ మిత్ర పక్షం అయితే జనసేనతో కేవలం ఏపీ వరకే పరిమితం అవుతూ వస్తారా లేదంటే తెలంగాణలో కూడా కలిసి ప్రచారం చేసే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది.
ఇలాంటి సందేహాల మధ్యలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇంట్రెసట్ఇంట్ కామెంట్లు చేస్తున్నారు.
జనసేనతో కలిసి పనిచేసే విషయమై బీజేపీలో అంతర్గతంగా చర్చిస్తామన్నారు. """/"/
అయితే ఆయన మాటలను బట్టి చూస్తుంటే అసలు జనసేనతో తెలంగాణలో కలిసి పనిచేఏందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తోంది.
ఇక గతంలో జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీతో తమకు పొత్తు లేదని పవన్ కల్యాన్ కూడా చెప్పిన విషయం తెలిసిందే.
కాగా తమ పొత్తు కేవలం ఏపీకి మాత్రమే పరిమితమన్నారు.ఇక బీజేపీ నేతల ప్లాన్ ప్రకారం ఇప్పుడు తెలంగాణలో ఎలాగూ బలపడుతున్న సమయంలో తమ జనసేనతో పొత్తు అంటే తెలంగాణ సెంటిమెంట్ తో తమ ఇమేజ్ దెబ్బ తింటుందని భావిస్తున్నారు.
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు…