మెరుపు వేగంతో పులిని ఢీకొట్టిన కారు.. దాని పరిస్థితి చూస్తే గుండె బరువెక్కుతుంది..??
TeluguStop.com
అటవీ ప్రాంతాల గుండా వేసిన రహదారుల్లో వెళ్లేటప్పుడు వాహనదారులు చాలా జాగ్రత్తగా, స్లోగా వెళ్లాలి.
ఎందుకంటే వన్యప్రాణులు( Wild Animals ) రోడ్డుపై అటు ఇటు తిరుగుతుంటాయి.వేగంగా వెళుతున్నప్పుడు వాటిని తప్పించడం కష్టమవుతుంది.
దీనివల్ల వాటికే కాకుండా వాహనదారులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశముంది.కానీ కొందరు కొంచెం కూడా సెన్స్ లేకుండా వందల కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంటారు.
ఇలాంటి ఒక బాధ్యతారహితమైన కారు డ్రైవర్ కారణంగా ఓ పులి అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో చనిపోయింది.
"""/" /
ఈ పులి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మృతి చెందింది.
ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని బండార-గొండి రహదారి( Bhandara-Gondia Highway)పై జరిగింది.
వేగంగా వెళ్తున్న క్రెటా కారు పులిని ఢీకొనడంతో ఆ పులి బతకడానికి అవకాశం లేనంతగా గాయపడింది.
ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో గాయపడిన పులి రోడ్డుపై నుంచి అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం చూడవచ్చు.
తీవ్ర గాయాలు కావడం వల్ల అది పడుతూ లేస్తూ ముందుకు కదిలింది.దాన్ని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే ఎవరికైనా సరే గుండె బరువెక్కాల్సిందే.
అయ్యో పాపం అని వీడియో చూసిన వారు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
ఈ ఘటన మహారాష్ట్ర( Maharashtra) ప్రజల్లో ఆందోళన కలిగించింది.రోడ్డు దాటుతున్న వన్యప్రాణులను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన పులిని చికిత్స కోసం నాగ్‌పూర్‌కు తరలించారు.
దురదృష్టవశాత్తు, పులి ఆసుపత్రికి చేరుకునేలోనే మరణించిందిబండార-గొండి రహదారి నావేగావ్ నాగ్‌జిరా అభయారణ్యం గుండా వెళుతుంది.
ఈ ఘటన రాత్రివేళ జరిగింది.చనిపోయిన పులి ఒక పెద్ద మగ పులి అని తెలుస్తోంది.
హైవే పక్కన వెహికల్స్ నెమ్మదిగా నడపాలని హెచ్చరించే బోర్డులు ఉన్నప్పటికీ, వాహనదారులు తరచుగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపుతున్నారు.
ఈ ఘటన జాతీయ రహదారి NH-753 సింగిల్ లేన్ విభాగంలో జరిగిందని తెలుస్తోంది.
ఈ రహదారి చాలా ఇరుకైనది, అటవీ ప్రాంతం గుండా వెళుతుంది.
సూపర్ హిట్ చిత్రం ఛావా సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?