స్కూల్ ఆటోను ఢీ కొట్టిన కారు

సూర్యాపేట జిల్లా:స్కూల్ పిల్లలతో రోడ్డు దాటుతున్న ఆటోను కారు ఢీ కొట్టిన ఘటన మునగాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ముందు జరిగింది.

కారు ఢీ కొట్టిన వేగానికి ఆటో పల్టీలు కొట్టింది.ఆ సమయంలో ఆటోలోని 12 మంది విద్యార్థులు ఉండగా అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

విద్యార్థులకు ఏమి కాకపోడంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం,స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.ఆటోలో ప్రమాదానికి గురైన విద్యార్థులందరూ మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ మధ్యకాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవకుండా ఆగిపోయిన సినిమాలు..!