తాండ్రియాలా గ్రామం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిన కారు

తాండ్రియాలా గ్రామం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిన కారు కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు మరోసారి మానవత్వం చాటుకున్న డాక్టర్ గోలి మోహన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతున్న నిర్మల్ కు చెందిన ఒక కుటుంబం వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామం వద్ద కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర గాయాల పాలయ్యారు.

డాక్టర్ గోలి మోహన్ వేములవాడ నియోజకవర్గ పర్యటన కార్యక్రమం ముగించుకుని వేములవాడ వస్తుండగా రోడ్డుపై పడిన క్షతగాత్రులను చూసి వెంటనే హుటాహుటిన తన స్వంత కారులో కథలాపూర్ ఆసుపత్రిలో చేర్చి ప్రథమ చికిత్స అందించారు.

తర్వాత వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.ఇది చూసిన ప్రజలు డాక్టర్ గోలి మోహన్ ని ప్రశంసించారు.

యూకే ఎన్నికలు : పంజాబీ సంతతి ఎంపీల హవా.. హౌస్ ఆఫ్ కామన్స్‌‌లోకి ఏకంగా 12 మంది..!!