భాగ్యనగరంలో నిమజ్జనాల సందడి ఘనంగా గణనాథుల శోభాయాత్రలు

డప్పు చప్పుళ్లు బ్యాండ్‌ బాజాలతో దద్దరిల్లుతుండగా భక్తి గీతాలు, కళాకారుల ప్రదర్శనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర జరుగుతోంది.

నగరంలో ఎటు చూసినా గణపతి విగ్రహాల ఊరేగింపుల సందడే కనిపిస్తోంది.భాగ్యనగరం ( Bhagyanagaram )నలువైపులా మొత్తం 74 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి.

ప్రధాన చెరువులు, జంట జలాశయాలు, హుస్సేన్‌ సాగర్‌తో పాటు బేబీ పాండ్‌లలో నిమజ్జనాల ఏర్పాట్లు చేశారు.

విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీ ఎత్తున క్రేన్లు ఏర్పాటు చేశారు.కేవలం హుస్సేన్ సాగర్ దగ్గరే 34 క్రేన్లు ఏర్పాటు చేశారు.

ట్యాంక్‌బండ్‌పై 14, ఎన్టీఆర్ మార్గ్‌లో 10, పీవీ మార్గ్‌లో 10 క్రేన్లు నిమజ్జనాల కోసం ఉంచారు.

క్రేన్ల దగ్గర పనిచేసైసేందుకు ప్రత్యేకంగా వెయ్యి మంది ఎంటమాలజీ సిబ్బందిని నియమించారు.నిమజ్జన ప్రాంతాల దగ్గర డీఆర్ఎఫ్‌, గజ ఈతగాళ్లను సిద్ధం చేసి ఉంచారు.

నగరం మొత్తం 354 కిలోమీటర్ల మేర నగరంలో గణపతి విగ్రహాల శోభాయాత్రలు జరగనున్నాయి.

బాలాపూర్‌ నుంచి చార్మినార్‌ మీదుగా.హుస్సేన్‌సాగర్‌ వరకు గణేశుని శోభాయాత్ర జరగనుంది.

భక్తుల కోసం 34 లక్షల వాటర్‌ ప్యాకెట్లు సిద్ధం చేశారు అధికారులు.వాటర్‌ ప్యాకెట్ల పంపిణీకి 122 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా 3 వేల మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు.

తేజ సజ్జా ‘మిరాయ్’ మూవీతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా..?