ఆవు పేడతో టైల్స్ తయారుచేసే వ్యాపారం.. లక్షల్లో సంపాదిస్తున్న రైతులు
TeluguStop.com
బ్రతకడానికి వంద మార్గాలు ఉన్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు.అది నిజమని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు( Farmers ).
ఆవు పేడను ఎరువుగా ఉపయోగిస్తారనే విషయం మనకు తెలిసిందే.కానీ ఆవు పేడతో పెద్ద వ్యాపారమే చేస్తున్నారు రైతులు.
ఈ వ్యాపారం ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు.అదే ఆవు పేడ టైల్స్( Cow Dung Tiles ) బిజినెస్.
పశవుల కాపరులు, రైతులు ఇలా ఆవు పేడ టైల్స్ తయారుచేసి వాటిని ఈ కామర్స్ వెబ్‌సైట్లలో విక్రయిస్తున్నారు.
"""/" /
ఇంటిని నిర్మించేటప్పుడు మనం బండరాళ్లతో తయారుచేసిన టైల్స్ ఉపయోగిస్తూ ఉంటాం.
రకరకాల డిజైన్లలో ఈ టైల్స్ ని తయారుచేస్తారు.అందంగా మెరిసే టైల్స్‌ను ఇంటి కోసం మనం తీసుకుంటాం.
కానీ ఇప్పుడు మార్కెట్ లో ఆవు పేడ టైల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.
వీటిని చాలామంది ఉపయోగిస్తున్నారు.ఆవు పేడతో తయారుచేసిన టైల్స్ ఇంటిని చల్లగా ఉంచుతాయి.
అలాగే వీటి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.వీటికి బాగా డిమాండ్ ఏర్పడంతో కొన్ని కంపెనీలు పుట్టుకొచ్చాయి.
రైతులు, పశువుల కాపరుల నుంచి ఆవు పేడను కొనుగోలు చేస్తున్నాయి.యంత్రాల ద్వారా ఆవు పేడను ప్రాసెస్ చేసి టైల్స్ తయారుచేస్తున్నారు.
"""/" /
వీటిని తయారుచేసేందుకు పెద్ద ఎత్తున రైతులను నియమించుకుంటున్నారు.ఇక రైతులే స్వయంగా ఇలాంటి యంత్రాలను కొనుగోలు చేసి ఆవు పేడ టైల్స్ ను తయారుచేస్తున్నారు.
ఇక ఛత్తీస్ గఢ్‌లో ( Chhattisgarh )ప్రభుత్వ సహకారంతో కొంతమంది మహిళలు ఇలాంటి టైల్స్ ను తయారుచేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.
పాత కాలంలో పూరి గూడిసెలు ఎక్కువగా ఉండేవి.ఇలాంటి సమయంలో కింద టైల్స్ ఉండేవి కాదు.
ఇలాంటి సమయంలో నేలకు ఆవుపేడ రాసేవారు.ఆవు పేడ రాయడం వల్ల ఇంట్లో చల్లగా ఉంటుంది.
ఇంటి ఉష్ణోగ్రతలను 5 నుంచి 8 శాతానికి తగ్గిస్తుంది.
వైరల్: పిల్లి, కప్పతో పాము పోరాటం.. మామ్మూలుగా లేదుగా!