బస్ డ్రైవర్ హెల్మెట్ పెట్టుకున్నాడు... ఎందుకో తెలిస్తే సలాం చేస్తారు!
TeluguStop.com
బేసిగ్గా హెల్మెట్ అనేది బైకర్స్ ధరిస్తూ వుంటారు.బైక్ పై ప్రయాణిస్తున్నపు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కూడా.
ఎందుకంటే హెల్మెట్ ధరించని కారణంగా మనదేశంలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
అయితే ఇక్కడ కేవలం దానికోసం మాత్రమే కాకుండా మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేక పోలీసులు వేసే జరిమానా నుంచి తప్పించుకోవటం కోసమో ధరిస్తూ వుంటారు.
అలాకాకుండా హెల్మెట్‌ను మన భద్రత కోసం, మనపై ఆధారపడి ఉన్న వారి కోసం పెట్టుకుంటే మంచిది.
అందుకే హెల్మెట్ ధరించడం అనేది చాలా మంచి అలవాటు.అయితే బైకర్స్ హెల్మెట్ పెట్టుకోవడం సాధారణమైన విషయం.
కానీ బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించడం మీరెప్పుడైనా చూశారా? ఇపుడు అలాంటి ఓ మనిషి గురించే తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్ లోని గాజియాబాద్ లో ఓ బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది.అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి.
దీంతో గాయాలబారిన పడకుండా, వర్షం, గాలి నుంచి రక్షణ కోసం డ్రైవర్ హెల్మెట్ ధరించాడు.
అదే అతని ప్రాణాలను కాపాడింది. """/"/
బాగ్‌పత్ సరిహద్దులో ఈ దృశ్యం కనిపించగా తాజాగా వెలుగు చూసింది.
ప్రమాదం జరిగిన బస్సును డ్రైవర్ అలాగే డిపోకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.మరో బస్సును ఢీకొట్టటం వల్ల ముందు అద్దాలు పగిలిపోయాయని డ్రైవర్ వివరించారు.
రోడ్డుపై వెళ్తున్న బస్సును ఓ వ్యక్తి వెంబడించి మరీ ఫొటోలు, వీడియోలు తీశారు.
ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలో డ్రైవర్ ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
అందరు ఇంత బాధ్యతగా వ్యవహరిస్తే దేశం క్షేమంగా ఉంటుందని అంటున్నారు.మీరు కూడా ఓసారి ఆ పోస్ట్ తిలకించండి.