ఆరేళ్లకే గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన ఎద్దు.. ఎలాగంటే..

కేవలం మనుషులు మాత్రమే కాదు అప్పుడప్పుడు జంతువులు కూడా ప్రపంచ రికార్డులను నెలకొల్పుతుంటాయి.

అందుకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు ఇదివరకే సోషల్ మీడియాలో చాలానే చూశాం.

తాజాగా ఓ ఎద్దు సంబంధించి గిన్నిస్ ఓ ప్రశంస పత్రాన్ని అందజేసింది.ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.

"""/" / తాజాగా ఓ ఎద్దు గిన్నిస్ వరల్డ్ రికార్డు( Guinness World Record )లో తన పేరుని నమోదు చేసుకుంది.

వినడానికి ఆశ్చర్యం వేసిన ఇది మాత్రం నిజం.కేవలం ఆరు సంవత్సరాల ఉన్న హోల్‌స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా రికార్డులను సృష్టించింది.

ఈ ఎద్దు అమెరికాలోని ఒరేగాన్ లో ఓ జంతు సంరక్షణ కేంద్రంలో ఉంది.

ఈ ఎద్దు చాలా పొడవుగా, వెడల్పుగా ఉండడంతో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారింది.

ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు.అయితే ఈ ఎద్దు స్వతహాగా చాలా సౌమ్యంగా ఉంటుందని దానికి సంరక్షకులు తెలుపుతున్నారు.

"""/" / ఇక ఈ రికార్డు సంబంధించి వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వీడియోను షేర్ చేయగా.

ప్రస్తుతం అది వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న రోమియో( Romeo ) పేరు గల ఎద్దు 1.

94 మీటర్ల ఎత్తు అనగా ఆరడుగుల 4.5 అంగుళాలు ఉండడంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా రికార్డు సృష్టించింది.

ఈ రోమియో ఎద్దు ఆహారాన్ని బాగా ఇష్టపడుతుంది.ముఖ్యంగా ఆపిల్, అరటి పండ్లు లాంటి వాటిని తరచు ఎక్కువగా తీసుకుంటుందని దాని సంరక్షకులు తెలుపుతున్నారు.

వీటితోపాటు ప్రతిరోజు ఈ ఎద్దు 45 కేజీల ఎండు గడ్డిని., అలాగే తృణధాన్యాలను ఆహారంగా తీసుకోగలదని సంరక్షకులు తెలిపారు.

కార్తీకదీపం నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ కాల్ చేసి అలా చేశారా?