పేక‌మేడ‌లా కూలిపోయిన బిల్డింగ్‌.. కార‌ణం ఏంటంటే..

ఈ మ‌ధ్య కురుస్తున్న వ‌ర్సాల‌కు ఎన్నో విధ్వంసాలు జ‌రుగుతున్నాయి.గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ కార‌ణంగా ఇప్ప‌టికీ కొన్ని చోట్ల అనేక ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్నాయి.

అదేంటి ఇప్పుడు వ‌ర్షాలు లేవు క‌దా అనుకుంటున్నారు క‌దా.అవును కానీ అప్పుడు కురిసిన వ‌ర్షాల‌కు ఇంకా ఇబ్బందులు త‌లెత్తుతూనే ఉన్నాయి.

మొన్న బెంగుళూరులో ఓ మూడంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన ఘ‌ట‌న అంద‌రికీ విదిత‌మే.అయితే అప్పుడు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు.

ఇక దీన్ని మ‌రువ‌క ముందే ఇప్ప‌డు అదే బెంగుళూరులో మ‌రో ప్ర‌మాదం జ‌ర‌గ‌గ‌డం అంద‌రినీ క‌లిచి వేస్తోంది.

మొన్న బెంగులూరు ప‌ట్ట‌ణంలో కురిసిన భారీ వర్షాలకు దేశంలోని పలు ప‌ట్ట‌ణాల్లో పెద్ద బిల్డింగులు కూడా కూలిపోయాయి.

ఇక ఇవ‌న్నీ వ‌ర్షాల‌కు కూలిపోతే రీసెంట్‌గా బెంగుళూరులోని ఓ బిల్డింగ్ మాత్రం యజమాని నిర్లక్ష్యంతో పేక మేడ‌లా కూలిపోయింది.

ప‌ట్ట‌ణంలోని కస్తూరినగర డాక్టర్స్‌ లేఔట్ ప్రాంతంలో ఓ య‌జ‌మాని రీసెంట్ గా మూడంతస్తుల బిల్డింగ్ క‌ట్టాడు.

అయితే దీన్ని క‌రెక్టు ప్లానింగ్ లేకుండానే క‌ట్ట‌డంతో కొద్ది రోజులుగా ఒక‌వైపుకు ఒరుగుతోంది.

ఇది గ‌మ‌నించిన అధికారులు అందులో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.

"""/"/ ఇలా వీరిని ఖాళీ చేయిచిన కొద్ది రోజుల‌కే గురువారం తెల్లవారుజామున ఈ బిల్డింగ్ కాస్తా ఒకవైపు పూర్తిగా ఒరిగిపోయింది.

ఈ బిల్డింగ్ పునాదిలో ఉన్న లోపం కార‌ణంగానే ఇలా జ‌రిగిన‌ట్టు మునిసిపల్ ఆఫీస‌ర్లు వివ‌రించారు.

ఇక భ‌వ‌నం కూలిపోయిన వెంట‌నే సమాచారం అందుకున్న అధికారులు చేరుకుని అన్ని ర‌కాలుగా సహాయక చర్యలు చేపట్టినట్లు మున్సిప‌ల్ శాఖ వెల్ల‌డించింది.

ఇక దీనికి ప‌ర్మిష‌న్ ఇచ్చిన అసిస్టెంట్ ఇంజనీర్ శంకరప్పను సస్పెండ్ చేసి విచార‌ణ‌కు ఆదేశించారు అదికారులు.

ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి, డిసెంబర్‌లో పెళ్లి.. అంతలోనే ఘోరం