Bride Dance : టేలర్ స్విఫ్ట్ పాటకు క్యూట్ డ్యాన్స్ చేసిన వధువు.. వీడియో వైరల్..
TeluguStop.com
ఈ రోజుల్లో వరుడి ముందు వధువులు హార్ట్ టచింగ్ పాటలకు అదిరిపోయే డ్యాన్సులు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
"బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా ( Bullettu Bandi )పా" అంటూ తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసిన వధువు నుంచి ఈ ట్రెండ్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది.
తాజాగా మరొక హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
ఇందులో వధువు వరుడు ముందు నిల్చుని పెళ్లి వేడుకల వేళ టేలర్ స్విఫ్ట్ రాసిన "లవ్ స్టోరీ( Love Story )" పాటకు ఆకట్టుకునేలా డాన్స్ చేసింది.
"""/" /
సాధారణంగా టేలర్ స్విఫ్ట్( Taylor Swift ) అభిమానులను 'స్విఫ్టీస్' అని పిలుస్తారు, ఈ అభిమానులు ఈ వధువు డ్యాన్స్ కు మరింత అట్రాక్ట్ అయ్యారు.
వారు వధువు ప్రత్యేకమైన వేడుకను చూసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ వీడియోను ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు షేర్ చేశారు, వధువు అదిరిపోయే పర్ఫామెన్స్ ను ప్రశంసించారు.
వీడియోలో, వధువు వరుడు, పెళ్లికి వచ్చిన అతిథులు ముందు చాలా గ్రేస్ ఫుల్ గా డాన్స్ చేయడం మనం చూడవచ్చు.
అతిథులు తమ ఫోన్‌లలో వధువు డ్యాన్స్ ను రికార్డ్ చేయడం కూడా మనం చూడవచ్చు, చిరస్మరణీయ క్షణాన్ని రికార్డ్ చేయాలని వారు కోరుకున్నారు.
"""/" /
పోస్ట్ చేసిన కొంత సమయానికే ఈ వీడియో బాగా వైరల్ అయింది.
దీనికి ఆరు లక్షల దాకా వీల్స్ వచ్చాయి.ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
పోస్ట్ కామెంట్ సెక్షన్లో చాలామంది వధువు డాన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
బహుశా పెళ్లి ఈ వధువు డాన్స్ హైలెట్ అయి ఉంటుందేమో అని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
మరికొందరు వధువు డ్యాన్స్ భాషా అవరోధంతో సంబంధం లేకుండా పాటకు కనెక్ట్ అయ్యేలా చేసిందని పేర్కొన్నారు.
ఈ బ్యూటిఫుల్ వెడ్డింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.
మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. రికార్డ్ అంటూ?