సీఎంపై రాయిదాడి కేసు..నిందితుడి కస్టడీ పిటిషన్ పై రేపు ఆర్డర్

ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) పై రాయిదాడి కేసుపై పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్( Satheesh ) ను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

జగన్ పై దాడి కేసు( Attack On CM YS Jagan )లో ఉన్న కుట్రకోణంపై మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరపగా.ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.

ఈ క్రమంలోనే కస్టడీ పిటిషన్ పై కోర్టు రేపు ఆర్డర్ ఇవ్వనుంది.మరోవైపు నిందితుడి స్టేట్ మెంట్ ను 164 సీఆర్పీసీ కింద నమోదు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.

ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేసేందుకు నిందితుడి తరపు న్యాయవాది సమయం కోరడంతో న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

వీడియో కాల్‌లో భర్త ఉండగా ఫోన్‌ని పుణ్యజలాల్లో ముంచేసిన భార్య.. వీడియో చూస్తే నవ్వాగదు..