టోర్నడో వల్ల ప్రమాదంలో పడిన తల్లిదండ్రులు.. కాపాడటానికి బాలుడు ఊహించని సాహసం..??
TeluguStop.com
ప్రకృతి వైపరీత్యాల సమయంలో పెద్దవారికి చాలా భయం వేస్తుంది.ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని సురక్షితమైన ప్రదేశాలకు తరలిపోతుంటారు.
ఎంత తొందరగా ఒక షెల్టర్ చూసుకుంటే అంత మంచిదిగా భావిస్తారు.ఇక చిన్న పిల్లలైతే ఏడుస్తూ పూర్తి నిస్సహాయక స్థితిలో ఉంటూ తల్లిదండ్రుల పైనే ఆధారపడతారు.
కానీ ఇటీవల బ్రాన్సన్ అనే తొమ్మిదేళ్ల బాలుడు ఒక ప్రమాదకరమైన తుఫాను సమయంలో అసాధారణమైన ధైర్యాన్ని చూపించాడు.
అతని కుటుంబం కారులో ప్రయాణిస్తున్నప్పుడు, EF-4 అనే శక్తివంతమైన తుఫాను వారి ప్రాంతాన్ని తాకింది.
ఈ తుఫాను లేదా టోర్నడో(storm ,tornado) చాలా బలంగా ఉండటం వల్ల వారి ట్రక్కును ఎత్తి, దూరంగా విసిరివేసింది, దీంతో అది పల్టీలు కొడుతూ లోపల ఉన్న కుటుంబ సభ్యులను బాగా గాయపరిచింది.
ఈ ఘటన జరిగినప్పుడు బ్రాన్సన్ తన తల్లిదండ్రులు వేన్, లిండీ బేకర్‌లతో కలిసి ఉన్నాడు.
"""/" /
తుఫాను వారి ట్రక్కుపై ఒక చెట్టు పడేలా చేసింది, దీంతో బ్రాన్సన్ తల్లిదండ్రులు లోపల చిక్కుకున్నారు.
ఈ ఘటనలో బ్రాన్సన్ బాగానే గాయపడ్డాడు.చాలా భయంతో వణికిపోయాడు.
తుఫాను చాలా శక్తివంతంగా ఉండడం వల్ల చాలా పవర్ లైన్లను నేలకు కూలాయి, ఈ కారణంగా ఆ ప్రదేశం చాలా ప్రమాదకరంగా మారింది.
ఇన్ని సవాళ్లున్నా ఆ బాలుడు భయపడలేదు.సహాయం చేయగల వ్యక్తిని కనుగొనే వరకు ఒక మైలు పాటు పరిగెత్తాడు.
మైల్ దూరం పరిగెత్తాక కనిపించిన వ్యక్తికి తన తల్లిదండ్రుల పరిస్థితిని వివరించాడు.అతను వెంటనే సహాయం చేయడంతో తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడిగలిగారు.
"""/" /
ముఖ్యంగా గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్ అనే ఇన్‌స్టాగ్రామ్(Instagram) పేజీ బాలుడు గురించి ఒక పోస్ట్ షేర్ చేసింది.
బ్రాన్సన్ ధైర్యం గురించి తెలుసుకొని ఇంటర్నెట్ యూజర్లు ఫిదా అయ్యారు.వారు అతని కథనాన్ని పంచుకున్నారు.
బాలుడి పోస్ట్‌కు 80 వేల దాకా వ్యూస్ వచ్చాయి.అతను చేసిన పనికి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఈ బాలుడు అసలైన హీరో అని పిలుస్తున్నారు.ఇంత చిన్న వయస్సులో ఉన్న అబ్బాయి ఏదైనా ధైర్యంగా చేయడం అసాధారణమని వారు అంటున్నారు.
బ్రాన్సన్ తండ్రి వేన్ బ్రాన్సన్(Wayne Branson) సహాయం కోసం పరుగెత్తకపోయి ఉంటే, పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవని అభిప్రాయపడ్డాడు.
తన కుమారుని ఆలోచన, ధైర్యానికి చాలా కృతజ్ఞతలు తెలుపుతాడు.వేన్ తన గాయాల నుండి రికవర్ అవుతున్నాడు, అయితే బ్రాన్సన్ తల్లి లిండీ ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటన తర్వాత బాలుడు న్యూస్ ఛానల్ తో మాట్లాడుకోవడానికి భయమేస్తుంది అని కానీ తన తల్లిదండ్రులను ఎలాగైనా బతికించుకోవాలనే కోరిక వల్ల తాను హెల్ప్ కోసం పరిగెత్తానని చెప్పాడు.
ఈ ఘటన జరిగిన మరుసటి రోజు అతడు బాస్కెట్‌బాల్ గేమ్‌లో పాల్గొని తన గొప్ప మెంటల్ ఫిజికల్ స్ట్రెంత్ ను చూపించాడు.
భాగస్వామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రష్మిక.. అలా చెప్పడంతో?