లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. భయపడి చివరికి ఏం చేశాడో చూస్తే గుండెలు అదురుతాయి..!

ఈ రోజుల్లో లిఫ్ట్ ఫెయిల్యూర్ ఘటనలు అధికమవుతున్నాయి.ఇప్పటికే లిఫ్టులో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల చాలామంది చనిపోయారు.

కాగా తాజాగా మరో లిఫ్టు లోపం బయటపడింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియోలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఒక బాలుడు ఎంతో భయపడినట్లు మీరు గమనించవచ్చు.

తర్వాత గట్టిగ గట్టిగా అరుస్తూ, చేతులతో లిఫ్ట్ గోడలను బలంగా మోదుతూ కనిపించాడు.

వీడియో ముగిసే వరకు ఆ లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో ఆ బాలుడు మరింత భయపడుతూ మానసికంగా చాలా కుంగిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే.గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని నిరాలా ఆస్పైర్ సొసైటీలో ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 8 ఏళ్ల బాలుడు శుక్రవారం సాయంత్రం లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు.

గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 14వ ఫ్లోర్‌కు వెళ్తున్న ఈ బాలుడు నాలుగు, ఐదో అంతస్తుల మధ్య పది నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు.

అటువంటి పరిస్థితిలో, పిల్లవాడు సహాయం కోసం చాలాసార్లు పిలిచాడు.ఎమర్జెన్సీ బటన్‌ను కూడా నొక్కాడు, కానీ ఇప్పటికీ పిల్లవాడు సహాయం పొందలేకపోయాడు.

చిన్నారి చాలా సేపు లిఫ్ట్‌లోని ఇంటర్‌కామ్, ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కుతూనే ఉన్నాడు.అయితే ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు.

"""/"/ అలాగే సీసీ కెమెరాలు చెక్ చేసే వ్యక్తి కూడా కనిపించకుండా పోయాడు.

చివరికి పిల్లోడు లిఫ్ట్ డోర్ బలంగా బాదుతూ హెల్ప్ చేయండి అని అరిచాడు.

చివరికి ఎలాగోలా దాన్నుంచి బయటపడ్డాడు.దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అపార్ట్‌మెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.