2022 టి20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ పై హ్యాట్రిక్ నమోదు చేసిన ఈ దేశ బౌలర్..
TeluguStop.com
టి20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో మొదలై తుది దశకు చేరుకుంది.సూపర్ 12 మ్యాచ్లన్నీ ఒక్కొక్కటిగా పూర్తి అవుతున్నాయి.
దాదాపు ఒకటి రెండు రోజుల్లో ఈ మ్యాచ్ లన్ని పూర్తి అయిపోయే అవకాశం ఉంది.
ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి టి20 ప్రపంచ కప్ 2022 సెమీఫైనల్స్ మొదలవుతాయి.
ప్రస్తుతం సూపర్ 12 ఆడుతున్న 12 జట్లు జట్లలో ఎనిమిది జట్లు ఇంటిదారి పట్టవలసి ఉంటుంది.
సెమీఫైనల్స్ వెళ్లే నాలుగు జట్లు మాత్రమే ఈ మ్యాచ్లలో తలబడతాయి.టి20 ప్రపంచ కప్ 2022లో న్యూజిలాండ్, ఐర్లాండ్ ల మధ్య మ్యాచ్లో మరో హ్యాట్రిక్ నమోదయింది.
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ స్టేడియంలో జరుగుతున్న న్యూజిలాండ్-ఐర్లాండ్ మధ్య మ్యాచ్లో ఇన్నింగ్ మొదట్లో దుమ్ముదులిపిన న్యూజిలాండ్ బ్యాటింగ్ లైన్ అప్ చివరి ఓవర్లల్లో చతికిలబడిపోయింది.
ఐర్లాండ్ బౌలింగ్‌కు తలవంచి వరుస టికెట్లు సమర్పించుకుంది.ముఖ్యంగా ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ తన బౌలింగ్ తో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ముప్పు తిప్పలు పెట్టాడు.
200లకు పైగా స్కోర్ సాధించేలా కనిపించిన న్యూజిలాండ్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగుల వరకే కట్టడి చేశాడు.
టాస్ ఓడిపోయి మొదటిగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్లు శుభారంభాన్ని అందించిన చివర్లో వికెట్లు కోల్పోయి ఒక మోస్తారు స్కోర్ నే నమోదు చేశారు.
కేప్టెన్ కేన్ విలియమ్సన్ చాలా కాలం తరువాత టచ్‌లోకి వచ్చాడు.35 బంతుల్లో మూడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 61 పరుగులు చేశాడు.
చివర్లో డారిల్ మిఛెల్ 21 బంతుల్లో 31 పరుగులతో నాట్ అవుట్ గా మెరిశాడు.
"""/"/
చిన్న దేశమైన ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ న్యూజిలాండ్ స్కోర్ కు బ్రేక్ వేశాడు.
19 వ ఓవర్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ వరుస మూడు బంతులలో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు.
ఈ హ్యాట్రిక్ నమోదు చేయడం లిటిల్ కు రెండవసారి.టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి ఐర్లాండ్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
కత్తిపోట్ల వల్ల సైఫ్ అలీ ఖాన్ కు అన్ని వేల కోట్ల రూపాయల నష్టమా.. ఏం జరిగిందంటే?