81 ఏళ్ల తర్వాత లైబ్రరీకి చేరిన బుక్.. 17వ పేజీలో ఏముందంటే..?
TeluguStop.com
ఎన్నో పురాతన గ్రంధాలు, పుస్తకాలు, తారపత్ర గ్రంథాలు( Texts, Books, Treatises ) చాలా సంవత్సరాల తర్వాత బయటపడుతూ ఉంటాయి.
వీటిల్లో ఉండే విషయాలు చాలా ఏళ్ల తర్వాత వెలుగులోకి వస్తూ ఉంటాయి., తాజాగా అలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది.
81 ఏళ్లకు ఒక పుస్తకం లైబ్రరీకి చేరుకోగా.అందులో 17వ పేజీలో ఉన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
అమెరికాలోని వాషింగ్టన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. """/" / వాషింగ్టన్‌లోని ఎబర్డీన్‌లో( Aberdeen, Washington ) ఉన్న ఒక లైబ్రరీకి ఒక రీడర్ వెళ్లాడు.
81 ఏళ్ల తర్వాత లైబ్రరీ నుంచి తీసుకున్న ఒక పుస్తకాన్ని తిరిగి ఇచ్చేందుకు అక్కడకు వచ్చాడు.
ఈ పుస్తకాన్ని చూసి అక్కడివారు ఆశ్చర్యపోయారు.ఈ పుస్తకం 1942 మార్చి 30న ఇష్యూ చేసినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
అప్పటి పుస్తకం ఇప్పుడు 81 ఏళ్ల తర్వాత లైబ్రరీకి రావడంతో అందరూ షాక్ అయ్యారు.
ఆ పుస్తకంలోని 17వ పేజీలో ఉన్న కాగితం ఆసక్తికరంగా మారింది.తనకు ఒకవేళ డబ్బులు ఇచ్చిన పక్షంలో ఈ పుస్తకాన్ని ఎప్పటికీ చదవను అంటూ ఆ కాగితంలో రాసి ఉంది.
దీనిని బట్టి చూస్తే ఈ పుస్తకం తీసుకెళ్లిన వ్యక్తికి ఈ పుస్తకం చదవడం ఇష్టం లేదని అర్ధమవుతుంది.
"""/" /
ది బౌంటీ ట్రిలాజీ( The Bounty Trilogy ) అనే వ్యక్తి రాసిన ఈ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి ఒక వ్యక్తి తీసుకెళ్లాడు.
81 ఏళ్ల తర్వాత పుస్తకాన్ని తిరిగి ఇవ్వడానికి ఎబర్డీన్ టింబర్లాండ్ లైబ్రరీకి వచ్చాడు.
ఈ పుస్తకం పాత సమాన్ల మధ్య పడి ఉందని, ఇప్పుడు లభ్యం కావడంతో తిరిగి ఇచ్చినట్లు చెబుతున్నాడు.
లైబ్రరీ ప్రతినిధులు ఈ విషయాన్ని తమ ఫేస్ బుక్ పేజీలో తెలిపారు.
ఒకవేళ ఆలస్యంగా ఈ పుస్తకాన్ని తిరిగి ఇచ్చినందుకు లేట్ ఫీజు వేస్తే రూ.
40 వేలు అవుతుందట.అయితే కరోనా మహమ్మారి సమయంలో లేట్ ఫీజును లైబ్రరీ ప్రతినిధులు ఎత్తివేశారు.
తప్పులు సరిదిద్దుకుంటున్న జగన్ .. సీనియర్లకే ఆ ఛాన్స్