చెట్టు తొర్రలో చిన్నారుల మృతదేహాలను కనుగొన్నారు.. ఎక్కడంటే?

వింటుంటే ఒళ్ళు గగుర్పుడుతోంది కదూ.మీరు విన్నది అక్షరాలా నిజం.

అక్కడి చెట్టుతొర్రలో కొన్ని వేల మృతదేహాలు వున్నాయి.ఇదేదో మర్డర్ మిస్టరీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.

ఈ భూ ప్రపంచంలో చాలా దేశాల్లో వింత వింత ఆచారాలు అనేవి ఉంటాయి.

ముఖ్యంగా పుట్టుక, చావు, పెళ్లి లాంటి వాటిలో అవి ఎక్కువగా మనకు కనిపిస్తాయి.

మన పూర్వీకులతో ప్రారంభమైన పద్ధతులే పరంపరగా కొనసాగుతూ ఉంటాయి.అలాంటి ఓ వింత ఆచారం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇపుడు ఆ వింత సంప్రదాయం గురించి తెలుసుకుందాం.ఎక్కడి ప్రజలు దాన్ని పాటిస్తున్నారో కూడా తెలుసుకుందాం.

సాధారణంగా చనిపోయిన వాళ్లను.ఆయా మతాల సంప్రదాయాల ప్రకారం, హిందువులైతే దహనం చేయడం, క్రైస్తువులైతే సమాధిలో పూడ్చి పెట్టడం.

జరుగుతూ ఉంటుంది.కానీ, ఇండోనేసియాలో 'తానా తరోజా' అనే తెగ ప్రజలు మాత్రం ఓ విచిత్ర సంప్రదాయాన్ని పాటిస్తారు.

ఈ తెగలో ఎవరైనా పిల్లలు మరణిస్తే వాళ్లను దహనం చేయరు.పూడ్చి పెట్టరు.

ఓ పెద్ద చెట్టు తొర్రలో దాచి ఉంచుతారు.ఆలా దాచిపెడితే కుళ్లిపోయి వాసన వస్తుంది కదా అనే అనుమానం రావచ్చు.

కానీ అక్కడ ఎలాంటి చేదు వాసన కూడా రాదు.ఎందుకంటే చనిపోయిన మృతదేహాలను కొన్ని ఔషధాలతో అక్కడ దాచిపెడతారు.

కాగా ఆ చెట్టు లోపాల పాతి పెట్టే సంప్రదాయాన్ని ఎన్నో ఏళ్లుగా ఆ ప్రజలు పాటిస్తున్నారు.

అయితే ఇది కేవలం చిన్నపిల్ల విషయంలోనే జరుగుతుంది., పెద్దలు ఎవరైనా మరణిస్తే సాధారణ పద్ధతిలోనే అంత్యక్రియలు చేస్తారు.

అయితే ఆ చెట్టులో వున్న తమ పిల్లలను చనిపోయినట్టు వారు భావించరు.ఆ చెట్టును ఎంతో ప్రేమగా కాపాడుకుంటారు.

ఎలాంటి కష్టం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.వినడానికి వింతగా ఉన్నా.

ఈ ఆచారం కొన్ని శతాబ్ధాలుగా ఆనవాయితీగా వస్తోంది.వీలైతే ఆ చెట్టుని దర్శించండి.

Healthy Salad : నిత్యం ఈ టేస్టీ సలాడ్ ను తిన్నారంటే వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్ తో స‌హా అదిరిపోయే బెనిఫిట్స్ మీసొంతం!